Advertisement
Google Ads BL

అఖిల్ చెప్పింది అక్షరాలా నిజం


స్టార్ ఫ్యామిలీ నుండి హీరోలు వస్తున్నారంటే.. వాళ్ళ మీద ఫాన్స్ బాగా అంచనాలు పెట్టుకుంటారు. తండ్రిలాగానో, తాతలాగానో.. మొదటి సినిమాకే స్టార్ హీరో అవ్వాలని కోరుకుంటారు. ఆ అంచనాలు అందుకోవడానికి స్టార్ కిడ్స్ అందరూ కష్టాలు పడతారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ మొదటి సినిమాతోనే స్టార్స్ కాలేదు. ఇక అఖిల్ కూడా అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో. తాత అక్కినేని నాగేశ్వరరావు టాప్ హీరో, తండ్రి నాగార్జున టాప్ హీరో, అన్న చైతన్య సూపర్ హీరో.. అందుకే అఖిల్ ఎంట్రీ సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంటే.. అఖిల్ వాళ్ళ అంచనాలు అందుకోవడానికి మూడు, నాలుగు సినిమాలు టైం పట్టింది.

Advertisement
CJ Advs

అఖిల్ రీసెంట్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో సూపర్ హిట్ కొట్టాడు. తాజాగా ఓ ఇంగ్లీష్ డైలీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిల్ మాట్లాడుతూ.. సినిమా బ్యాగ్ రౌండ్ ఉండడం ఒకరకంగా అదృష్టమే.. మరో రకంగా దురదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే చాలా ఒత్తిడి ఉంటుంది. టాప్ స్టార్ మనవాడిగానో, టాప్ స్టార్ కొడుకు అనగానే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతాయి. ఆ అంచనాలు అందుకోవడానికి కష్టపడాలి.. ప్రస్తుతం నేను అందులో నుండి బయటికి వచ్చి నాకు నేను గా నిలబడడాన్ని ఛాలెంజ్ గా స్వీకరించి.. నన్ను నేను నిరూపించుకోవడానికి కష్ట పడుతున్నా.

నేను ఇండస్ట్రీ నుండి వచ్చిన వాడిని.. అందుకే ఎక్కడివరకు వెళ్ళగలను, ఎంతవరకు వెళ్లగలను అనేది అలోచించి శ్రమిస్తాను. ప్రస్తుతం సురేందర్ రెడ్డి సినిమాలో గూఢచారి ఏజెంట్ గా నటిస్తున్నా. ఇది పూర్తి స్థాయి యాక్షన్ మూవీ అని చెప్పుకొచ్చాడు. నిజమే అఖిల్ చెప్పింది అక్షరాలా నిజం. స్టార్ కిడ్ అనగానే ఫాన్స్ లో హోప్స్ విపరీతంగా పెరిగిపోతాయి. 

Akkineni Akhil about his Family Background:

Akkineni Akhil about his Agent Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs