హీరోల ఫాన్స్ కి ఆయా హీరోలంటే విపరీతమైన అభిమానం ఉంటుంది. తమ హీరో అనుకోకుండా చనిపోతే చాలామంది గుండెలు ఆగిపోతాయి. ఇక ఒక హీరో మీద మరో హీరో ఫాన్స్ ఎమన్నా అంటే చాలు.. యుద్ధాలే జరుగుతాయి. సోషల్ మీడియాలో ఫాన్స్ వార్ ఇవన్నీ చూస్తూనే ఉంటాము . అభిమాన స్టార్స్ కోసం కాలి నడకన వేల మైళ్ళు నడవడం, అలాగే పెయింటింగ్స్ చెయ్యడం అబ్బో చాలానే చూస్తుంటాం. రీసెంట్ గా కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ అనుకోకుండా మృతి చెందడం ఆయన అభిమానులని కలిచి వేసింది. ఎన్నో గుండెలు పునీత్ మరణంతో ఆగిపోయాయి. అయితే పునీత్ రాజ్ కుమార్ చనిపోక ముందు ఆయనకి కాస్త నలతగా ఉంది అని ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకి వెళ్లగా.. అయన ఈసీజీ, బిపి అన్ని చెక్ చేసి విక్రమ్ హాస్పిటల్ కి పంపించారు. కానీ ఈలోపే పునీత్ ప్రాణాలు పోయాయి.
అయితే పునీత్ ఫ్యామిలీ డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ కి సరైన టెస్ట్ లు చెయ్యలేదని.. అందుకే ఆయన మృతి చెందారని అయన అభిమానులు ఆరోపిస్తున్నారు. ఆరోపణలు వరకు ఓకె కానీ పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీ డాక్టర్ ఇంటిపై, క్లినిక్ పై పునీత్ అభిమానులు దాడులు చెయ్యాలని చూడడంతో.. కర్ణాటక సీఎం ఆ డాక్టర్ ఇంటికి పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేయించాల్సి వచ్చింది. అయితే తాను కొన్ని టెస్ట్ లు చేశాను అని.. యాంజియో గ్రామ్ చెయ్యడానికి మంచి ఎక్విప్మెంట్ విక్రమ్ హాస్పిటల్ లో ఉండడంతో.. ఆయన్ని అక్కడికి పంపాను అని.. తాను చెయ్యాల్సింది చేశాను అని, అంబులెన్సు లో అయితే టైం ఎక్కువ అని కారులో వాళ్ళని పంపేసి.. విక్రమ్ హాస్పిటల్ కి ఫోన్ చేసి ఐసీయూ రెడీ చెయ్యమని కూడా చెప్పాను అని.. తనవంతుగా ఆయన్ని బ్రతికించడానికి ప్రయత్నాలు చేసినట్లుగా పునీత్ ఫ్యామిలీ డాక్టర్ చెప్పారు.