Advertisement
Google Ads BL

పుష్ప: ది రైజ్: మంగళం శ్రీను గా సునీల్


అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న పుష్ప: ది రైజ్ సినిమా నుంచి అభిమానులకు ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుంచి మరొక అప్డేట్ బయటికి వచ్చింది. కమెడియన్ గాను, హీరోగానూ, రీసెంట్ గా విలన్ గాను అదరగొడుతున్న సునీల్ పుష్ప సినిమాలో డిఫ్రెంట్ కేరెక్టర్ లో కనిపించబోతున్నాడనే ప్రచారం ఉంది. తాజాగా పుష్ప నుండి మంగళం శ్రీనుగా సునీల్ పాత్రను పరిచయం చేశారు దర్శక నిర్మాతలు. ఇన్నేళ్లు ఆయనను కమెడియన్ గా మాత్రమే చూసాం. ఇప్పుడు సునీల్ లోని మరో కోణాన్ని దర్శకుడు సుకుమార్ ఆవిష్కరిస్తున్నారు. అందుకే రాక్షసుడిని పరిచయం చేస్తున్నాం అంటూ సునీల్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. 

Advertisement
CJ Advs

జుట్టుకు రింగు.. ఫోన్ మాట్లాడుతూ ఉరిమి చూసే కళ్లు.. చూడగానే భయపడే రూపంతో సునీల్ పోస్టర్ అదిరిపోయింది. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పోస్టర్ లో ఉన్న ఇంపాక్ట్ కంటే.. సినిమాలో సునీల్ క్యారెక్టర్ 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు మేకర్స్. ఇక ఇప్పటికే పుష్ప రాజ్ గా అల్లు అర్జున్, శ్రీవల్లిగా రష్మిక లుక్స్ కి విపరీతమైన ఆదరణ రాగా.. ఇప్పుడు సునీల్ మరో డిఫ్రెంట్ లుక్ లో అదరగొట్టేస్తున్నాడు. ఇక పుష్ప సినిమా భారీ అంచల మధ్యన డిసెంబర్ 17 న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

Sunil unveils evil power in Pushpa:

Pushpa: Sunil stuns as Mangalam Srinu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs