Advertisement
Google Ads BL

హే.. అనుష్క వచ్చేసింది


టాలీవుడ్ లో స్టార్ హీరోస్ అందరితో నటించడమే కాదు.. బాహుబలి తో ప్రపంచాన్నే చుట్టేసి పాన్ ఇండియా హీరోయిన్ అయిన అనుష్క గత కొన్నేళ్లుగా యాక్టీవ్ గా లేదు. గత ఏడాది నిశ్శబదం కూడా నిరాశపరచడంతో అనుష్క మాయమైపోయింది. ఇక అనుష్క సినిమాలు వదిలేస్తుంది.. లైఫ్ లో సెటిల్ అయ్యి పెళ్లి చేసుకోబోతుంది అనే న్యూస్ కూడా ప్రచారం లోకి వచ్చింది. ఇక నేడు అనుష్క శెట్టి పుట్టిన రోజు. అనూహ్యంగా అనుష్క పేరు.. మళ్ళీ బయటికి వచ్చింది. అది కూడా కొత్త సినిమాతో.

Advertisement
CJ Advs

అనుష్క శెట్టి పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా అనౌన్స్ చేశారు యు.వి.క్రియేషన్స్ నిర్మాతలు. సాహో, రాధే శ్యామ్ లాంటి భారీ సినిమాలతో దేశవ్యాప్తంగా యు.వి.క్రియేషన్స్ కు అద్భుతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ సంస్థలో అనుష్క శెట్టి హ్యాట్రిక్ సినిమా చేయబోతున్నారు. ఇది అనుష్కకు 48వ సినిమా. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థలో అనుష్క రెండు సినిమాలు చేశారు అనుష్క శెట్టి. 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి.. 2018లో లేడీ ఓరియెంటెడ్ భాగమతి సినిమాలను యు.వి.క్రియేషన్స్ నిర్మించారు. ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. భాగమతి సినిమా తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ ఒకేసారి విడుదలై అద్భుతమైన విజయం అందుకుంది. ఇందులో తనదైన నటనతో అందరినీ మెప్పించారు అనుష్క శెట్టి.

ఇప్పుడు మూడోసారి అనుష్క యు.వి.క్రియేషన్స్ కలిసి సినిమా చేయబోతున్నారు. దర్శకుడు మహేష్ బాబు న్యూ ఇమేజ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అనుష్క అభిమానులకు ఇది నిజంగా బర్త్ డే సర్ ప్రైజ్. ఏ మాత్రం హడావిడి లేకుండా ఉన్నట్టుండి ఆమె కొత్త సినిమా ను అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు అనుష్క శెట్టి. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. త్వరలోనే దీనిపై దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించనున్నారు. భాగమతి సినిమా తెలుగుతో పాటు సౌతిండియన్ భాషల్లో తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమాను కూడా మహేష్ బాబు అన్ని భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఎవరెవరు నటించబోతున్నారు అనే విషయంపై చిత్ర యూనిట్ త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయనున్నారు. నవంబర్ 7న అనుష్క పుట్టినరోజు సంధర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.

UV Creations announces Anushka48 :

UV Creations announces Anushka48 On the occasion of Anushka Shetty birthday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs