హీరో కార్తికేయ RX 100 తో హీరో అవడమే కాదు.. నాని గ్యాంగ్ లీడర్ తో విలన్ కింద అదరగొట్టేసాడు. తాజాగా స్టార్ హీరో అజిత్ సినిమా వాలిమై లో పవర్ ఫుల్ విలన్ గా చేస్తున్నాడు. ఇక తెలుగులో రాజా విక్రమార్కతో రేపు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా ఈవెంట్ లో కార్తికేయ తనకు కాబోయే భార్యను కార్తికేయ పరిచయం చేశారు.
తన ప్రేమకథ గురించి కార్తికేయ మాట్లాడుతూ.. ఆ అమ్మాయికి నేనే ప్రపోజ్ చేశా. తన మెసేజ్ కోసం ఎదురుచూశా. గిఫ్టులు ఇచ్చాను. నా లైఫ్ లో హీరో అవ్వడానికి పెట్టినంత స్ట్రగుల్ పెట్టాను. ఫోనులో ప్రపోజ్ చేశా. ఆ రోజే నేను హీరో అవుదామనుకుంటున్నాను. హీరో అయ్యాక మీ ఇంటికి వచ్చి అడుగుతా అని చెప్పా. ఫైనల్లీ... ఆ అమ్మాయిని నవంబర్ 21న పెళ్లి చేసుకోబోతున్నాను. తన పేరు లోహిత. తను నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, గాళ్ ఫ్రెండ్. ఎక్స్ గాళ్ ఫ్రెండ్. ఇక నుంచి ఒక్కటే రోల్.. వైఫ్ అని చెప్పారు. ఆ తర్వాత అదే వేదికపై లోహితకు కార్తికేయ ప్రపోజ్ చేశారు.