కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అంటే.. కార్తీ ఖైదీ, విజయ్ మాస్టర్ సినిమాలు వెంటనే గుర్తొస్తాయి. ఇక లోకనాయకుడు కమల్ హాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. విలక్షణ నటుడు ఆయన. అలాంటి కమల్ - లోకేష్ కనకరాజ్ కలిస్తే.. బాక్సాఫీసు బద్దలే. లోకేష్ కనకరాజ్ - కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కుతున్న విక్రమ్ మూవీ పై భారీ అంచనాలున్నాయి. లోకేష్ ఖైదీ లో చీకటిలో సినిమా తీసి అదరగొట్టేస్తే.. మాస్టర్ లో ఇద్దరి హీరోల మధ్యన ఫైట్ పెట్టి హిట్ కొట్టాడు. మరి కమల్ విక్రమ్ లో లోకేష్ కనకరాజ్ ఏం చూపించబోతున్నాడో అనుకుంటే.. మరోసారి యాక్షన్ ప్యాక్డ్ విక్రమ్ నే చూపిస్తున్నట్టుగా విక్రమ్ ఫస్ట్ గ్లాన్స్ లోనే చూపించేసాడు. రేపు కమల్ హాసన్ బర్త్ డే స్పెషల్ గా ఈ విక్రమ్ గ్లాన్స్ ని రిలీజ్ చేసారు మేకర్స్.
విక్రమ్ ఫస్ట్ గ్లాన్స్ లో కొంతమంది వ్యక్తులు తుపాకీలతో పోలీస్ స్టేషన్‌పై దాడి చేయడం కనిపించింది. బుల్లెట్ల నుండి తనను తాను రక్షించుకోవడానికి రెండు షీల్డ్‌లను పట్టుకుని, గూండాలను ఎదుర్కోవడానికి వాటిని పక్కన పెట్టుకుని కమల్ హాసన్ స్టైల్‌గా ఎంట్రీ ఇచ్చాడు. వీడియోలో ఫహద్ ఫాసిల్ ఎదురు గ్యాంగ్‌లో తుపాకీతో కనిపిస్తాడు. విక్రమ్ ఫస్ట్ గ్లాన్స్ మొత్తం ఫుల్ యాక్షన్ మోడ్ లోనే ఉంది.. ఇంకా ఈ సినిమాలో విజయ్ సేతుపతి కూడా కీ రోల్ పోషిస్తున్నాడు. ఇక కమల్ విక్రమ్ ఫస్ట్ లుక్ తోనే అంచనాలు పెంచితే.. ఇప్పుడు ఈ యాక్షన్ గ్లాన్స్ తో మరిన్ని అంచనాలు పెంచేసాడు లోకేష్ కనకరాజ్.