ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరు వెళుతున్నారో అనేది ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లోనే లీకైపోయింది. బిగ్ బాస్ లీకులు షురూ అన్నట్టుగా రేపు ఆదివారం ఎలిమినేట్ అవ్వబోయేది వీరే అంటూ వారి పేర్లు బయటికి వచ్చేసాయి. తొమ్మిదో వారంలో విశ్వ, ప్రియాంక, సిరి, జెస్సి, రవి, కాజల్, సన్నీ లు నామినేషన్స్ లో ఉంటే.. అని మాస్టర్, మానస్, షణ్ముఖ్ లు సేఫ్ జోన్ లో ఉన్నారు. అయితే ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్న ప్రియాంక, జెస్సి, విశ్వ అని అనుకున్నారు. ప్రియాంక పెద్దగా గేమ్ ఆడకుండా మానస్ తో రొమాన్స్ అంటూ నెట్టుకొచ్చింది ఇన్నాళ్లు. ఇక జెస్సి గత కొన్ని వారాలుగా యాక్టీవ్ గా లేడు. హెల్త్ ఇష్యు తో పాటుగా.. ఎజెసి సీక్రెట్ టాస్క్ విషయంలో రెండుసార్లు ఫెయిల్ అయ్యాడు.
ఇక విశ్వ టాస్క్ ల పరంగా స్ట్రాంగ్. రవి, విశ్వ, మానస్, శ్రీరామ్, సన్నీ వీళ్లతో పోటీపడి ఆడతాడు. కానీ ఎమోషనల్ గా వీక్. అయినా ఈ వారం ప్రియాంక అండ్ జెస్సి లలో ఎవరో ఒకరు వెళ్ళిపోతారనుకుంటే.. అనూహ్యంగా విశ్వ ఎలిమినేట్ అవడం షాకిచ్చింది. ఈ ఆదివారం విశ్వ బిగ్ బాస్ హౌస్ ని వీడబోతున్నాడు. ఇప్పటికే విశ్వ ఎలిమినేషన్ పూర్తవడం.. స్టేజ్ పై నాగార్జున తో విశ్వ నించోవడం కూడా జరిగిపోయాయి. ఇక ఈ రోజు నాగార్జున విలన్ vs హీరోల టాస్క్ పెట్టాడు. మరి అందులో మెయిన్ విలన్ ఎవరో.. మెయిన్ హీరో హీరో ఎవరో ఈరోజు ఎపిసోడ్ లో చూడాలి.. కానీ.. రేపు విశ్వ ఎలిమినేట్ అవడమే ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. వీక్ కంటెస్టెంట్స్ ని వదిలేసి విశ్వాని ఎలిమినేట్ చెయ్యడం ఏమిటా అని.