సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా టిక్ టాక్స్ తో విపరీతమైన పాపులారిటీ సంపాదించిన ఫన్ బకెట్ భార్గవ్ తో వీడియోస్ చేస్తే ఫెమస్ అవ్వొచ్చని తనదగ్గరికి వచ్చిన మైనర్ బాలికని లొంగదీసుకుని గర్భవతిని చేసాడు అనే కారణంతో పోలీస్ లు అరెస్ట్ చేసి దిశ చట్టం కింద కేసు నమోదు చేసారు. దానితో ఫన్ బకెట్ భార్గవ్ కి పోక్సో చట్టం కింద జైలు శిక్ష పడుతుంది అనుకున్నారు. కానీ ఫన్ బకెట్ భార్గవ్ బెయిల్ మీద బయటికి వచ్చేసాడు. సోషల్ మీడియాలో తనకి విపరీతమైన ఫేమ్, క్రేజ్ ఉన్నాయని, అమ్మాయిలని మోసం చేసిన భార్గవ్ అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటికి వచ్చాక కూడా తన యాటిట్యూడ్ లో ఎలాంటి మార్పు లేదు. బయటికి వచ్చాక కూడా భార్గవ్ తనకి క్రేజ్ పాపులారిటీ ఉన్నాయని.. మళ్ళీ ఫెమస్ అవుతాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ.. యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వూస్ ఇచ్చాడు.
అయితే ఫన్ బకెట్ భార్గవ్ బెయిల్ పై ఉండి.. కోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తూ సోషల్ మీడియాలో పోస్టుల పెట్టడం తో పాటుగా, ఆ బాలిక తల్లితండ్రుల్ని బెదిరించడం, అలాగే సాక్షులను ప్రభావితం చేసేలాగా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఫన్ బకెట్ భార్గవ్ ని దిశ పోలీసులు తిరిగి అరెస్ట్‌చేసి కోర్టులో హాజరు పరచడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ కేసులో భార్గవ్ కి ఈనెల 11వరకు రిమాండ్ విధిస్తున్నట్టుగా పోక్సో ప్రత్యేక కోర్టు కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. దానితో ఫన్ బకెట్ భార్గవ్ ని పోలీస్ లు విశాఖ సెంట్రల్ జైలు కి పంపించారు.