టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు స్నేహితులుగా ఉంటారు. చిన్న హీరోలైనా పెద్ద హీరోలైనా అందరూ స్నేహంగానే ఉంటారు. తారక్ - రామ్ చరణ్, అల్లు అర్జున్ - ఎన్టీఆర్, మహేష్ - రామ్ చరణ్, పవన్ వెంకీ, పవన్ - మహేష్ బాబు ఇలా అందరూ మంచి ఫ్రెండ్ షిప్ ని మెయింటింగ్ చేస్తారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే తన మామిడి తోటలో కాచిన కాయలను చాలామంది హీరోలకి గిఫ్ట్ గా పంపిస్తారు. ఇక క్రిష్టమస్ గిఫ్ట్ లు కూడా పవన్ ఇంటి నుండి వెళుతుంటాయి. అలాగే శర్వానంద్ కూడా మామిడి కాయలు అందరికి పంపిస్తాడు. అయితే పవన్ కళ్యాణ్ తాజాగా మహేష్ బాబు కి మరి కొంతమందికి దివాళి గిఫ్ట్ లు పంపించడం హాట్ టాపిక్ గా మారింది.
దీపావళి పండగ రోజున పవన్ కళ్యాణ్ మహేశ్ బాబు ఫ్యామిలీకి స్వీట్లు, పర్యావరణహిత టపాసులను పంపించారు. పవన్ పంపిన క్రాకర్స్, స్వీట్స్ అందుకున్న మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ దంపతులకు కృతజ్ఞతలు తెలియజేసింది. మహేష్ కి మాత్రమే కాదు.. నితిన్, హరిహర వీరమల్లు దర్శకుడు క్రిష్ కి కూడా పవన్ కళ్యాణ్ స్వీట్స్ అండ్ క్రాకర్స్ పంపించారు. వాళ్ళందరూ సోషల్ మీడియాలో పవన్ కి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.