Advertisement
Google Ads BL

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతికి గాయం


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ మూవీ షూటింగ్ ఫినిష్ చేసి.. జెమినీ ఛానల్ లో ఎవరు మీలో కోటీశ్వరులు ఫస్ట్ సీజన్ ని కంప్లీట్ చేసి ఇంట్లో రిలాక్స్ అవుతున్నాడు.. త్వరలోనే ఫ్యామిలీ మెంబెర్స్ తో ఎన్టీఆర్ వెకేషన్స్ కి చెక్కెయ్యబోతున్నాడని అంటున్నారు. అయితే దివాళి రోజున తన కొడుకు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో ఎన్టీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్ తో ఎన్టీఆర్ ఫాన్స్ ఖుషి అయ్యారు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో ఈమధ్యన ఎన్టీఆర్ తన ఇంట్లోనే జిమ్ చేస్తున్న సమయంలో.. ఆయన కుడి చేతి బొటన వేలుకి గాయమవడంతో.. హాస్పిటల్ కి వెళ్లగా ఆయన బొటన వేలికి డాక్టర్స్ సర్జరీ చేశారట. 

Advertisement
CJ Advs

ఇది జరిగి నాలుగు రోజులవుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారని, చేతి వేలికి ఆపరేషన్ జరిగినా అంతా బాగానే ఉంది అని, అభిమానులెవరూ కంగారు పడవల్సిన అవసరం లేదని తెలిపారు. అభిమానులకి దివాళి విషెస్ చెబుతూ ఎన్టీఆర్ చేతికి కట్టు ఉండడాన్ని గమనించిన వారు ఆరా తియ్యగా ఎన్టీఆర్ చేతి వేలి ఆపరేషన్ విషయం బయటికి వచ్చింది. ఈమధ్యనే చిరు కుడి చేతికి ఆపరేషన్ చేయించుకోగా..రీసెంట్ గా బాలయ్య భుజానికి ఆపరేషన్ జరిగింది.. ఆ లిస్ట్ లో ఇప్పడు ఎన్టీఆర్ చేరాడు. 

NTR hurts himself-minor surgery performed:

NTR undergoes minor surgery
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs