బిగ్ బాస్ తొమ్మిదో వారం పూర్తి చేసుకుని.. పదవ వారంలోకి అడుగుపెడుతుంది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో సిరి - షణ్ముఖ్ లు వేరే గ్రూప్స్ లో ఆడడంతో.. వీరిద్దరూ గొడవ పడ్డారు. అలాగే మానస్.. ప్రియాంక ని హార్ట్ చేసాడు. ప్రియాంక బాగా ఫీలైంది. సిరి అయితే షణ్ముఖ్ పై ఫైర్ అయ్యింది. ఇక కెప్టెన్సీ టాస్క్ విషయంలో ఎవరికి వారే సోలోగా పోరాడుతున్నారు. ఈ వారం నామినేషన్స్ లో షణ్ముఖ్, మానస్, అని మాస్టర్ మాత్రమే ఉండగా.. మిగతా కాజల్, యాంకర్ రవి, సిరి, జెస్సి, శ్రీరామ్, సన్నీ, విశ్వ, ప్రియాంక లు నామినేషన్స్ లో ఉన్నారు. అయితే గత వారం హౌస్ నుండి లోబో ఎలిమినేట్ అయ్యాడు.
ఇక ఈవారం నామినేషన్స్ లో వారిలో శ్రీరామ్ ఓటింగ్ పరంగా నెంబర్ వన్ లో ఉన్నాడు. అయితే ఇప్పటివరకు షణ్ముఖ్ నెంబర్ వన్ లో ఉన్నప్పటికీ.. షణ్ముఖ్ ని బీట్ చేసి శ్రీరామ్ గత రెండు వారాలుగా నెంబర్ వన్ ప్లేస్ లోనే కొనసాగుతున్నాడు. ఇక తర్వాత యాంకర్ రవి, తర్వాత సిరి, కాజల్ సేఫ్ జోన్ లో ఉండగా.. విశ్వ, ప్రియాంక, జెస్సి లు డేంజర్ జోన్ లో ఉన్నారు. రేపు ఆదివారం జెస్సి కానీ, ప్రియాంక కానీ విశ్వ కానీ బయటికి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా జెస్సి లీస్ట్ ఓట్స్ తో వెనకబడి ఉన్నాడని.. ఫైనల్ గా తొమ్మిదో వారంలో విశ్వ కానీ ప్రియాంక కానీ జెస్సి కానీ బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్లిపోయే అవకాశం ఉంది.