Advertisement
Google Ads BL

అఫీషియల్: బాలయ్య సరసన శృతి హాసన్


బాలకృష్ణ అఖండ టైటిల్ సాంగ్ ప్రోమో సోషల్ మీడియాని ఊపెయ్యడమే కాదు.. బాలయ్య ఫాన్స్ కి మాంచి ట్రీట్ ఇచ్చింది. ఇక బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ ఆహా షో ఫస్ట్ ఎపిసోడ్.. దివాళి స్పెషల్ గా వదిలారు ఆహా ఓటిటి వాళ్ళు. మంచు మోహన్ బాబు తో బాలకృష్ణ అన్ స్టాపబుల్ ఆట వేట ఓ రేంజ్ లో ఉంది. ఇక బాలయ్య తదుపరి మూవీ NBK107 నుండి మైత్రి మూవీ మేకర్స్ అప్ డేట్ ఇచ్చి బాలయ్య ఫాన్స్ ని సర్ ప్రైజ్ చేసారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ NBK107 లో నటిస్తున్నారు. త్వరలోనే మొదలు కాబోతున్న ఈ మూవీలో తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా ఎప్పుడో ప్రకటించారు.

Advertisement
CJ Advs

ఇక ఈ దివాళి స్పెషల్ గా NBK107 నుండి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చేసారు. అది బాలకృష్ణ సరసన నటించబోయే హీరోయిన్ ని ప్రకటించేసారు. బాలయ్య సరసన ఇప్పటివరకు హీరోయిన్స్ విషయంలో పెద్ద ప్రాబ్లెమ్ నడుస్తుంది. గత కొన్ని సినిమాల నుండి బాలయ్య సరసన నటించడానికి చాలామంది హీరోయిన్స్ వెనుకడుగు వేస్తున్నారు. అంతెందుకు బాలయ్య అఖండ నుండే చాలామంది హీరోయిన్స్ షూటింగ్ కి హాజరయ్యాకే వెనక్కి తగ్గారు. ఇప్పుడు బాలయ్య NBK107 విషయంలోనూ బాలయ్య సరసన త్రిష, శ్రియ లాంటి పేర్లు వినిపించినా ఎక్కుగా శృతి హాసన్ పేరే వినిపించింది. తాజాగా శృతి హాసన్ కి 2.5 కోట్ల పారితోషకం ఇచ్చి లాక్ చేశారనే న్యూస్ నడుస్తున్న సమయంలో ఈ దివాళి స్పెషల్ గా శృతి హాసన్ ని NBK107 ప్రాజెక్ట్ లోకి ఆహ్వానిస్తున్నట్టుగా మైత్రి మూవీస్ అధికారికంగా ప్రకటించింది. 

Shruti Haasan Comes Aboard NBK107:

Shruti Haasan Comes Aboard Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers NBK107
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs