Advertisement
Google Ads BL

చిరు పై మోహన్ బాబు అభిప్రాయం..


బాలకృష్ణ తో ఆహా ఓటిటి వారు అన్ స్టాపబుల్ అనే టాక్ షో మొదలు పెట్టారు. దీపావళి రోజు అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ని ఆహా వారు గ్రాండ్ గా మొదలు పెట్టారు. బాలకృష్ణ హోస్ట్ గా మొదలైన ఆహా అన్ స్టాపబుల్ పై అందరిలో భారీ అంచనాలున్నాయి. బాలయ్య ఫస్ట్ టైం ఓ టాక్ షో చేయడం, కాంట్రవర్సీ ప్రశ్నలు కూడా ఈ షో లో వినిపించడంతో.. అన్ స్టాపబుల్ ప్రమోతోనే ఆహా కి విపరీతంగా సబ్ స్క్రైబర్స్ పెరిగిపోయారు. అల్లు అరవింద్ కాంపౌండ్ లో బాలయ్య అనగానే ఈ షో పై ఆసక్తి.. బాలకృష్ణ ఈ షో ఎలా చేస్తారో అనే ఇంట్రెస్టు పెరిగిపోయి.. ఆహా ని కొత్తగా సబ్ స్క్రైబ్ చేసుకునే వారు ఎక్కువయ్యారు.

Advertisement
CJ Advs

దివాళి స్పెషల్ గా ఈ రోజు మొదలైన ఫస్ట్ ఎపిసోడ్ లో మోహన్ బాబు ఫస్ట్ గెస్ట్ గా బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో కి వచ్చారు. ఈ షో లో మోహన్ బాబు తో సరదాగా ఓ ఆట ఆడుకున్న బాలయ్య సోదరా అంటూనే మోహన్ బాబు కి చమటలు పట్టించాడు. ఇక చిరు పై మోహన్ బాబుని నిజమైన అభిప్రాయాన్ని చెప్పమని అడగగా.. దానికి మోహన్ బాబు చిరంజీవితో పర్సనల్ గా నాకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, చిరంజీవి మంచి నటుడు, అద్భుతంగా డ్యాన్స్‌ చేస్తాడు, అలాగే పర్సనల్ గాను ఎలాంటి చెడు అభిప్రాయం కూడా లేదు. అల్లు ఆరామలింగాయయ్ గారు నేను కలిసి ఎన్నో సినిమాలు చేశాను. చిరంజీవి అల్లు రామలింగయ్య గారి కూతురు సురేఖ ని పెళ్లి చేసుకున్నాడు. సురేఖ నాకు సోదరి లాంటిది కాబట్టే చిరు బాగున్నాడు అంటూ సరదాగా సమాధానం చెప్పారు కానీ.. ఎలాంటి కాంట్రవర్సీలకి తావివ్వలేదు. బాలయ్య ఆటకి మోహన్ బాబు తనదైన స్టయిల్లో సమాధానాలు చెప్పారు. 

Mohan Babu about Chiranjeevi in Unstoppable:

Mohan Babu about Chiranjeevi in Unstoppable Talk show
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs