బాలకృష్ణ - బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న అఖండ మూవీ దివాళి సర్ ప్రైజ్ వచ్చేసింది. అఖండ మూవీ పై ఫాన్స్ లోనే కాదు.. ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. బోయపాటి హీరోలలోని మాసిజాన్ని ఏ రేంజ్ లో చూపిస్తాడో.. బాలయ్య తో చేసిన సింహ, లెజెండ్, అల్లు అర్జున్ తో చేసిన సరైనోడు మూవీస్ ఉదాహరణగా నిలుస్తాయి. హీరోలోని మాస్ కోణాన్ని బోయపాటి కన్నా ఎవరు ఎక్కువగా చూపించలేనంతగా ఆ మాస్ కోణాన్ని ఫాన్స్ కి ట్రీట్ గా అందిస్తాడు. ఇక అఖండ లో బాలకృష్ణ ని సూపర్ స్టైలిష్ గానే కాదు.. మాస్ అవతార్ అఘోర కేరెక్టర్ లోను చూపించబోతున్నారు. అఘోరాగా బాలకృష్ణ లుక్స్ తోనే హైప్ క్రియేట్ అయ్యింది. ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే రిలీజ్ అయిన అఖండ పోస్టర్స్, అఖండ రెండు టీజర్స్, అఖండ ఫస్ట్ సింగిల్ అన్ని సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి.
తాజాగా అఖండ నుండి అఖండ టైటిల్ సాంగ్ రోయర్ దివాళి స్పెషల్ గా రిలీజ్ చేసారు మేకర్స్. ఈ రోజు దివాళి రోజున 11.43 నిమిషాలకు.. భమ్ అఖండ టైటిల్ సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఫుల్ లిరికల్ వీడియో ని నవంబర్ 8 న రిలీజ్ చెయ్యబోతున్నారు. విజువల్ వండర్ గా కనిపిస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ చేస్తున్నాడు. ఈ సాంగ్ ప్రోమో లో టైటిల్ కార్డు నుండే నేపధ్య సంగీతం అదరగొట్టేసాడు థమన్. ప్రస్తుతం ఈ వీడియో ప్రోమో.. ఫాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. బాలయ్య చేతిలో త్రిసూలం.. అలా బాలయ్య ని చూస్తే అచ్చం దేవుడిని చూసిన ఫీలింగ్ వచ్చేసింది అంటున్నారు ఫాన్స్. అఘోర గా బాలయ్య మెస్మరైజ్ చేసారు. బాలకృష్ణ - బోయపాటి కాంబో అంటేనే అంచనాలు ఆకాశంలో ఉంటాయి.. ఇప్పుడు ఈ సాంగ్ ప్రమోస్, పోస్టర్స్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచేసింది. ఈ సినిమాని ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.