సూర్య హీరోగా.. జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈ దివాళీ కి అమెజాన్ ప్రైమ్ నుండి ప్రేక్షకుల ముందుకు వచ్చిన జై భీం మూవీ సోషల్ మీడియాలోనే కాదు.. ఎవరి నోటా విన్నా సినిమా సూపర్ డూపర్ అంటునాన్రు. సినిమాలో సూర్య పెరఫార్మెన్స్ పీక్స్ అని, సూర్య ని తెగ పొగిడేస్తున్నారు. కథని నమ్మి సూర్య తానే నిర్మాతగా మారి ఈ సినిమాని తెరకెక్కించారు. సూర్య నమ్మకాన్ని ప్రేక్షకులు నిలబెట్టారు. తమిళ్, తెలుగు రెండు చోట్లా జై భీమ్ కి హిట్ టాకే. జై భీమ్ ని వీక్షించిన ఓ అభిమాని.. తన స్పందనని తన ఫ్రెండ్స్ తో పంచుకున్నారు. అదేమంటే గిరిజన మహిళగా లిజోమోల్ జోస్ నిజంగా నటించడం కంటే కూడా జీవించింది అనే చెప్పాలి.. సినిమా పూర్తయ్యాక కూడా ఆమె పాత్ర మనకు గుర్తుండిపోతుంది, మణికంఠన్ పాత్ర కూడా అంతే.. అసలీ నటుల్ని ఎక్కడినుంచి తెచ్చారో కానీ నిజమైన గిరిజనులు ఉన్నారంతా.. ఈ విషయంలో తమిళ టెక్నీషియన్స్ నుంచి మనం చాలా నేర్చుకోవాలి
లాయర్ చంద్రు ఇంట్లో కాలు మీద కాలు వేసుకుని పేపరు చదువుతుంటాడు. ఆ టైమ్ లో అక్కడే ఉన్న రాజన్న బిడ్డ చంద్రులాగే కాలుమీద కాలేసుకుని కూర్చోని న్యూస్ పేపర్ చదవడం ఈ సినీమాకు హైలెట్. పోలీసు, న్యాయ వ్యవస్థ ఇద్దరూ కలిసి చేసే చెడును, చేయవలసిన మంచిని సరిగ్గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు జ్ఞానవేల్. చదువురాని వారు, లోకజ్ఞానం అసలు తెలియని వాళ్ళు తప్పుడు కేసుల్లో ఇరుక్కుని అన్యాయంగా జైలు శిక్షలు ఎలా అనుభవిస్తున్నారో ప్రత్యక్షంగా మన కళ్ళకు కట్టిన చిత్రం. భిన్నంగా నిస్వార్థంగా, నిజాయితీగా పని చేసే చెన్నై జస్టిస్ చంద్రు పాత్ర అందరికీ మార్గదర్శకం. డైరెక్షన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా ఇలా వేటికవే సూపరసలు అంటూ జై భీం ని వీక్షించిన తర్వాత తన మిత్రులతో పంచుకున్న మాట ఇది.