Advertisement
Google Ads BL

పిక్ టాక్: మెగా ఫ్యామిలీ దివాళి సెలెబ్రేషన్స్


సినిమా ఇండస్ట్రీలో ఏ భాషలో అయినా.. టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ లో ఉన్నంతమంది హీరోలు ఏ ఫ్యామిలిలోనూ లేరు. అలాంటి మెగా ఫ్యామిలీ మీద మీడియా ఎప్పుడూ ఓ కన్నేసే ఉంటుంది. చీమ చిటుక్కుమన్నా అది మీడియాలో వైరల్ అవుతుంది. ఇక మెగా ఫ్యామిలి చిరంజీవి మహా వృక్షంగాను.. నాగబాబు, పవన్, చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, వైష్ణవ, సాయి ధరమ్ ఇలా బోలెడంతమంది హీరోలు ఇండస్ట్రీలో హవా చూపిస్తున్నారు. ఇక ప్రతి ఫెస్టివల్ ని మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఆనందంగా జరుపుకుంటుంది. తాజాగా మెగా దీపావళి సెలబ్రేషన్ ఓ రేంజ్ లో జరిగాయి మెగా ఫ్యామిలిలో. రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన హోస్ట్ లు గా మెగా దివాళి సెలెబ్రేషన్స్ ఏ రేంజ్ లో జరిగాయో.. అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్ చూస్తేనే తెలిసిపోతున్నది. 

Advertisement
CJ Advs

అల్లు అర్జున్ ఆయన వైఫ్ స్నేహ, రామ్ చరణ్ ఆయన వైఫ్ ఉపాసన, వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్, నిహారిక ఆమె భర్త చైతన్య, సుష్మిత, శ్రీజ.. ఇలా మెగా ఫ్రేమ్ లో ఉండాల్సిన హీరోలంతా ఉన్నారు. చిరు, నాగబాబు, పవన్ కనిపించలేదు కానీ.. మిగతా యంగ్ హీరోల బ్యాచ్ మొత్తం మెగా ఫ్రెమ్ లో కనిపిస్తుంది. అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్ లు హుషారుగా ఫొటోలకి ఫోజులిచ్చారు. మెగా ఫ్యామిలిలో దివాళి సెలెబ్రేషన్స్ ఏ రేంజ్ లో జరిగాయో.. అల్లు అర్జున్ షేర్ చేసిన పిక్ లో తెలిసిపోతుంది. ఇక రామ్ చరణ్ అండ్ అల్లు అర్జున్ లు ఆర్.ఆర్.ఆర్ - పుష్ప పాన్ ఇండియా మూవీస్ తో ప్రేక్షకులముందుకు రాబోతున్నారు. 

Pic Talk: Mega Family Diwali Celebrations:

Ram Charan celebrates Diwali with Allu Arjun and cousins
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs