దివాళి వచ్చేసింది.. చిన్న సినిమాల పోస్టర్స్, పెద్ద సినిమాల సాంగ్స్, పోస్టర్స్, టీజర్స్.. అబ్బో దివాళి హంగామా ఓ రేంజ్ లో ఉంది. దివాళి కి మూడు రోజుల ముందే ఎప్పుడో జనవరిలో రిలీజ్ కాబోతున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ మేకర్స్ గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసి ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫాన్స్ కి కిక్ ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ నుండి లాలా భీమ్లా సాంగ్ ప్రోమో సోషల్ మీడియాని షేక్ చేసింది. మరోపక్క సర్కారు వారి పాట రిలీజ్ డేట్ హంగామా.. ఇంకా అఖండ సెకండ్ సింగిల్, అలాగే ఆచార్య సాంగ్ ప్రమో.. అబ్బో హడావిడి ఈ రేంజ్ లో ఉంది.. ఫాన్స్ తమ హీరోలని, ఆయా సినిమాలను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
కానీ అల్లు అర్జున్ - సుకుమార్ పుష్ప డిసెంబర్ లో రిలీజ్ కి సిద్ధమవుతుంటే.. ఆ సినిమా నుండి దివాళి స్పెషల్ గా కనీసం పోస్టర్ కూడా వదలకపోయేసరికి అల్లు అర్జున్ ఫాన్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. పుష్ప మేకర్స్ మైత్రి మూవీ మేకర్స్ ని #LuchaProductionHouse అంటూ హాష్ టాగ్ తో రెచ్చిపోయి ట్వీట్స్ చేస్తూ మైత్రి మూవీ మేకర్స్ ని నోటికి వచ్చినట్టుగా తిట్టేస్తున్నారు. నిన్నగాక మొన్న పుష్ప నుండి సాంగ్ ప్రోమో తో సర్ ప్రైజ్ ఇచ్చినా.. అల్లు ఫాన్స్ కి మాత్రం దివాళి స్పెషల్ ట్రీట్ రాకపోయేసరికి ఇలా చేస్తూ కాస్త చీప్ గానే ప్రవర్తిస్తున్నారు.