సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట స్పెయిన్‌లో లాంగ్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. పరుశురామ్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన విడుదల విషయంలో అతి పెద్ద అప్డేట్ వచ్చింది. అసలైతే సర్కారు వారి పాట 2022 సంక్రాంతికి రావాల్సి ఉండగా.. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్, ప్రభాస్ రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియా మూవీ మీద పోటీ ఎందుకులే అని మేకర్స్ సర్కారు వారి పాట రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గారు. తాజాగా సర్కారు వారి పాట కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు.
సర్కారు వారి పాట చిత్రం వచ్చే ఏడాది ఉగాది సందర్బంగా ఏప్రిల్ 1న విడుదల కాబోతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌కు రాబోతోన్నట్టు ప్రకటించిన పెద్ద చిత్రం ఇదే. ఈ సినిమాకు వేసవి సెలవులు కలిసి రానున్నాయి. హాలీడే సమయంలో విడుదలైన మహేష్ బాబు పోకిరి, భరత్ అనే నేను, మహర్షి వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.
ఇప్పటికే రిలీజైన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయనుంది.