రెండు రోజుల క్రితం పేకాట శిబిరాలపై ఎస్వోటీ పోలీస్ చేసిన దాడిలో హీరో నాగ శౌర్య ఫామ్ హౌస్ లోని ఓ 20 మంది ప్రముఖులు పేకాట ఆడుతూ పట్టుపడడం కలకలం సృష్టించింది. నాగ శౌర్య మాదాపూర్ కి చెందిన ఓ వ్యక్తి దగ్గర ఆరు నెలల క్రితం
మంచిరేవుల లో ఫామ్ హౌస్ ని రెంట్ కి తీసుకుని.. మళ్లీ వేరే వాళ్ళకి రెంట్ ఇవ్వడంతో.. ఆ రెంట్ కి తీసుకున్న గుత్తా సుమన్.. ఆ ఫారం హౌస్ లో పేకాట ఆడించడం పై పోలీస్ లకి సమాచారం అందడంతో.. పోలీస్ లు ఆ హౌస్ పై రైడ్ చెయ్యగా. అక్కడ ఓ 20 కార్ల తో పాటుగా భారీగా నగదు పట్టుకొని.. 20 మంది బడా బాబులని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విషయంలో నాగ శౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్ కి నర్సింగ్ పోలీస్ లు నోటీసు లు ఇచ్చారు.
నేడు నాగ శౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్ ని పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్పడమే కాకుండా.. వారు లీజుకి తీసుకున్న ఫామ్ హౌస్ లీజు పత్రాలు తీసుకురమ్మని చెప్పినట్లుగా తెలుస్తుంది. రవీంద్ర ని.. ఈ లీజు పత్రాలు చూసి పోలీస్ లు విచారించనున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ పేకాట నిర్వహణ కి కీలక సూత్రధారి గుత్తా సుమన్ ని పోలీస్ లు రెండు రోజులు కష్టడికి తీసుకుని ప్రశ్నించడమే కాదు.. అతని పాత నేర చరిత్రని పోలీస్ లు బయటికి తీసున్నట్లుగా తెలుస్తుంది.