Advertisement
Google Ads BL

హుజురాబాద్ ఓటమిపై కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్


హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేంద్ర విజయాన్ని మూటగట్టుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై 23, 855 ఓట్ల మెజార్టీతో ఈటల రాజేందర్ గెలుపొందారు. హరీష్ రావు, గంగుల, బాల్క సుమన్, ఇంకా టిఆర్ఎస్ ఎంపీల ప్రయత్నాలు, పన్నాగాలు హుజురాబాద్ లో ఈటెల హవా ముందు ఫలించలేదు. అయితే హుజురాబాద్ లో టిఆర్ఎస్ ఓటమిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఒక్కసారి వచ్చిన విశ్రమ ఫలితంతో పార్టీకి నష్టం కలగదన్నారు. హుజురాబాద్ లో టిఆర్ ఎస్ ఓటమి పార్టీపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పారు. ఒక్క ఓటమితో కుంగి పోవాల్సిన అవసరం లేదని, 20 ఏళ్లలో టీఆర్ఎస్ ఎన్నో గెలుపోటములను చూసిందని పేర్కొన్నారు. హుజూరాబాద్ ఎన్నికకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 

Advertisement
CJ Advs

టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తనవంతు పోరాడారని చెప్పారు.. అంతేకాకుండా టిఆర్ ఎస్ పార్టీ గెలుపు కోసం పని చేసిన హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. 

 

KTR Tweet on Huzurabad Bypoll Result:

Huzurabad election results trs lost the seat minister ktr tweeted spirited fight
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs