నందమూరి బాలకృష్ణ అఖండ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి.. NBK 107 మూవీ కి సిద్దమవ్వబోతున్నారు. మధ్యలో అల్లు అరవింద్ ఆహా ఓటిటి కోసం అన్ స్టాపబుల్ టాక్ షో కి హోస్ట్ గా అదరగొట్టేస్తున్నారు బాలయ్య. అయితే కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో దిగ్బ్రాంతికి గురైన బాలయ్య బెంగుళూరు వెళ్లి పునీత్ భౌతిక కాయానికి నివాళులర్పించి వచ్చారు. ఇక ప్రస్తుతం ఆహా టాక్ షో.. ఇలా బాలయ్య హడావిడి సోషల్ మీడియాలో నడుస్తుంది. అయితే తాజాగా బాలకృష్ణ కుడి భుజానికి ఆపరేషన్.. అంటూ టివిలో న్యూస్ రావడంని చూసిన నందమూరి అభిమానులు ఆందోళకు గురవుతున్నారు.
బాలకృష్ణ కొంతకాలంగా కుడి భుజం నొప్పితో బాధపడుతున్నారని, నిన్న కేర్ హాస్పిటల్లో డాక్టర్ రఘువీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బాలకృష్ణ కి కుడి భుజం ఆపరేషన్ జరిగింది అని, ఒక రోజు డాక్టర్స్ అబ్జర్వేషన్ లో ఉన్న బాలకృష్ణ ఈ రోజు సాయంత్రం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతున్నారని.. ఆయనకి ఇంతకు మించి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్స్ బాలయ్య హెల్త్ పై ప డేట్ ఇచ్చారు. దానితో అభిమానులు కూల్ అయ్యారు. ఇక బాలకృష్ణ ఈ కుడి భుజం ఆపరేషన్ కారణంగా ఓ ఆరు వారాలపాటు విశ్రాంతి అవసరం అని డాక్టర్లు చెప్పినట్లుగా తెలుస్తుంది.