Advertisement
Google Ads BL

ఆచార్య నీలాంబరి అప్ డేట్ అదిరింది


చిరంజీవి - రామ్ చరణ్ కాంబోలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య మూవీ ని ఫిబ్రవరి 4 న రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా ప్రకటించి మెగా ఫాన్స్ ని సర్ ప్రైజ్ చెయ్యలేదు.. ఎందుకంటే ఆచార్య ఈ డిసెంబర్ లోనే రిలీజ్ అనుకుని మెగా ఫాన్స్ సంబర పడ్డారు. కానీ వచ్చే ఏడు ఫిబ్రవరికి అనగానే కాస్త ఢీలా పడ్డారు. అయితే ఆచార్య లో రామ్ చరణ్ - పూజ హెగ్డే స్పెషల్ అప్పీరియన్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది.. సిద్ధగా చరణ్, నీలాంబరిగా పూజ హెగ్డే స్పెషల్ రోల్స్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్, సాంగ్ ప్రోమోస్ అన్ని ఒక ఎత్తైతే.. ఇప్పుడు రిలీజ్ చెయ్యబోయే సాంగ్ మరో ఎత్తు అనేలా ఉంది.

Advertisement
CJ Advs

దివాళీ స్పెషల్ గా చిరు - రామ్ చరణ్ కాంబో ఆచార్య సెకండ్ సింగల్ నీలంబరి సాంగ్ ని నవంబర్ 5 న ఉదయం 11.07 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లుగా (A memorable melody from మని sharma to take you back in time 🎶

Acharya second single Neelambari releasing on 5th Nov at 11:07 AM) మేకర్స్ ప్రకటించారు. రామ్ చరణ్ - పూజ హెగ్డే ల రొమాంటిక్ పోస్టర్ తో ఆచార్య అప్ డేట్ ఇచ్చేసారు. నీలాంబరి, సిద్ద గా రామ్ చరణ్ లుక్స్ వైజ్ గానే అంచనాలు క్రియేట్ చేసారు. ఇక ఇప్పుడు రొమాంటిక్ గా నీలాంబరి సాంగ్ తో సినిమాపై మరింతగా ఆసక్తిని క్రియేట్ చెయ్యబోతున్నారు. ఈ సినిమాలో చిరు ఆచార్య గా ఆయనకి జోడిగా గ్లామర్ డాల్ కాజల్ అగర్వాల్ నటించింది. సంగీత కీ రోల్ లో కనిపించనుంది. 

Acharya second single Neelambari releasing on:

Acharya second single Neelambari on 5th November 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs