Advertisement
Google Ads BL

గాడ్ ఫాదర్ సెట్స్ లోకి మెగాస్టార్


మెగాస్టార్ చిరంజీవి ఆచార్య షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. మోహన్ రాజా తో లూసిఫెర్ రీమేక్ గాడ్ ఫాదర్ షూటింగ్ లోకి జంప్ అయ్యారు. ఇప్పటికే హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో గాడ్ ఫాదర్ కి సంబందించిన కీలక సన్నివేశాలను, ఊటీ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేసారు. అయితే రీసెంట్ గా చిరంజీవి కుడి చేతికి జరిగిన ఓ సర్జరీ వలన చిరు గాడ్ ఫాదర్ షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు కోలుకోవడంతో చిరు గాడ్ ఫాదర్ సెట్స్ లోకి అడుగుపెట్టారు. సోమవారం నుంచి హైదరాబాద్‌లో గాడ్ ఫాదర్ కొత్త షెడ్యూల్‌ ప్రారంభించారు. ప్రస్తుత హైదరాబాద్ షెడ్యూల్‌లో చిరంజీవితో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు మోహన్ రాజా తెలిపారు. 

Advertisement
CJ Advs

పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో నయనతార నటిస్తుంది అనే టాక్ ఉంది. అలాగే చిరు ని దారుణంగా అవమానించే పాత్రలో అనసూయ కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ థమన్ అందిస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే చిరంజీవి. మెహెర్ రమేష్ కాంబో భోళా శంకర్ ఈ నెల 11 న పూజ కార్యక్రమాలతో మొదలై.. 15 నుండి రెగ్యులర్ షూట్ కి వెళ్లబోతుంది.

Godfather starts its new schedule:

Chiranjeevi gets going for Godfather
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs