బిగ్ బాస్ హౌస్ లో తొమ్మిదో వారం నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ ముసుగు తీసేసి.. మొహానికి క్రీమ్ రాసే ప్రాసెస్ లో.. శ్రీరామ్ చంద్ర తో సన్నీ, మానస్ లు గొడవలు పడ్డారు. యాంకర్ రవి తో కాజల్ గొడవ పడింది. మొహానికి క్రీమ్ రాసి నామినేట్ చేసింది. ఇక మానస్ కి శ్రీరామ చంద్ర, శ్రీరామ చంద్రకి మానస్, సన్నీ కి సిరి ఇలా మొహానికి క్రీమ్ రాసి నామినేట్ చేసారు. అని మాస్టర్ కూడా సన్నీ నే నామినేట్ చేసింది. బిగ్ బాస్ లో ఉండే అర్హతే లేదంటూ కాజల్ కి రవి క్రీమ్ పూసాడు. శ్రీరామ్ అయితే ఇదంతా చైన్ బ్యాచ్ గొడవల్లా ఉంది అన్నాడు.
ఇక కెప్టెన్ షణ్ముఖ్ ప్రియాంక దగ్గరకి వెళ్లి.. నీ గేమ్ నువ్వు ఆడు అనగానే.. నా గేమ్ నేను ఆడుతున్నా.. నన్ను పంపించేస్తే ఎవరు ఆడతారు గేమ్.. మీరు మీరు ఆదుకోండి అంటూ కోపం తెచ్చుకుంది. ఇక ప్రియాంక కి షణ్ముఖ్ క్రీమ్ ని చిన్నగా రాయడంతో.. ప్రియాంక షణ్ముఖ్ చేతిలోని క్రీమ్ ప్లేట్ ని ఫోర్స్ గా మొహానికి రాసేసుకుంది. అక్కడ కాస్త గొడవ జరిగినట్టుగా ఈ రోజు ప్రోమో లో చూపించారు. ఈ వారం కెప్టెన్ తప్ప మిగిలిన హౌస్ మేట్స్ మొత్తం నామినేట్ అయినట్లుగా తెలుస్తుంది.