Advertisement
Google Ads BL

ఆర్.ఆర్.ఆర్: పులి vs పులి


రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ పై ఇంకా ఇంకా అంచనాలు పెంచుతూనే ఉన్నారు. ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ని ఓ 45 సెక్షన్స్ గ్లిమ్ప్స్ తో మొదలు పెట్టిన రాజమౌళి..  ఆ చిన్నపాటి వీడియో లోనే రామ్ చరణ్ కి ఎన్టీఆర్ కి కావాల్సిన స్క్రీన్ స్పేస్ ఇచ్చి ఫాన్స్ ని సర్ ప్రైజ్ చేసాడు. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి గా ఆల్రెడీ చూసిన ఫాన్స్ కి ఈ ఆర్.ఆర్.ఆర్ గ్లిమ్ప్స్ వేరే లెవల్ గూస్ బంప్స్ ఇచ్చాయి. అజయ్ దేవగన్, అలియా భట్.. అందరూ ఎవరి కేరెక్టర్ వారిది అద్భుతమే అన్నట్టుగా ఉంది. ఇక ఈ గ్లిమ్ప్స్ లో మొదటి నుండి అంటే ఆర్.ఆర్.ఆర్ స్టార్ట్ అయిన నుండి ఎన్టీఆర్ తో పులి తో ఫైట్ చేసే సీన్స్ సినిమాకే హైలెట్ అంటూ ప్రచారం జరిగినట్టుగా.. ఆర్.ఆర్.ఆర్ గ్లిమ్ప్స్ లో లాస్ట్ లో పులి ఆంగ్లేయుల మీద కి ఉరికిన సీన్స్ నిజంగా ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది.

Advertisement
CJ Advs

అయితే ఆర్.ఆర్.ఆర్ లో ఒకొనొక సందర్భంలో ఎన్టీఆర్ కి - పులి మధ్యన భీకరమైన పోరు జరుగుతుంది అని, ఆ తర్వాత ఆ పులిని కొమరం భీం మచ్చిక చేసుకుని దానికి ట్రైనింగ్ ఇస్తాడని.. అలా పులికి ట్రైనింగ్ ఇచ్చి యుద్దానికి సిద్ధం చేసి.. తమపై యుద్దానికి వచ్చిన ఆంగ్లేయులపై కొమరం భీం పులిని వదలడమే కాదు.. తానూ పులిలా వారిపై గాండ్రిస్తూ విరుచుకుపడడంతో.. ఆంగ్లేయులతో పులి, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి భీకరంగా పోరాడతారంటూ అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పులి తో యాక్షన్ సన్నివేశాలు మాత్రం సినిమాకే హైలెట్ గా ఉండబోతున్నాయని, ఆర్.ఆర్.ఆర్ గ్లిమ్ప్స్ లో పులి బ్రిటిష్ సైనికులపై ఉరకడంతో ఇప్పుడు జరుగుతున్న ప్రచారానికి  ఓ క్లారిటీ వచ్చింది అని అంటుంటే.. ఈ న్యూస్ చూసిన ఎన్టీఆర్ ఫాన్స్ కి పూనకలొచ్చేస్తున్నాయి. 

RRR: Tiger vs Tiger:

RRR first glimpse: An explosive mind-blowing Roar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs