ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. వయసు చిన్నదే.. కానీ ఆమె నటనలో ఎన్నో సినిమాలు చేసిన అనుభవం కనిపిస్తుంది. లుక్స్ లో కూడా ఎంతో మెచ్యూరిటీ అమ్మాయిలా కనిపిస్తుంది. ఉప్పెన సినిమాలో కృతి శెట్టి నటన హైలెట్ అనేలా ఉంటుంది. దానితో కృతి శెట్టి ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే.. యంగ్ హీరోల సినిమాలతో బిజీ అయ్యింది. ఒకటా రెండా.. ఏకంగా ఐదు ప్రాజెక్ట్స్ తో కృతి శెట్టి టాప్ హీరోయిన్స్ కే పోటీ ఇచ్చేలా తయారైంది. RAPO19 లో రామ్ తో, సుధీర్ బాబు - ఇంద్రగంటి కాంబో మూవీలో, నితిన్ మాచర్ల నియోజకవర్గం మూవీలో, నాగ చైతన్య బంగార్రాజు మూవీ, ఇక రిలీజ్ కి రెడీ అవుతున్న నాని శ్యామ్ సింగ రాయ్ మూవీలో కృతి శెట్టి నటిస్తుంది.
ఇక తాజాగా ఓ డిజైనర్ డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ లో కృతి శెట్టి మెరిసింది. ప్రముఖ డిజైనర్ భార్గవి కోణం డిజైన్ చేసిన స్పెషల్ డిజైనర్ వేర్ లో కృతి శెట్టి కుందనపు బొమ్మలా రెడీ అయ్యి.. రకరకాల ఫొటోస్ కి ఫోజులిచ్చింది. ప్రస్తుతం కృతి శెట్టి న్యూ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరి మీరు బేబమ్మ లేటెస్ట్ ఫొటోస్ ని ఓ లుక్కెయ్యండి.