ప్రస్తుతం పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రవేటీకరణను వ్యతిరేకిస్తూ పోరాడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యపై వైసీపీ సర్కార్ వారంలోగా స్పందించాలని.. పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా చట్టసభల్లో మాట్లాడాల్సిన నేతలు మౌనంగా ఉంటే ఏం లాభం. వైసీపీ మాటలకు అర్థాలు వేరులే. చెప్పినమాటకు తూట్లు పొడవటమే వైసీపీ అధినేత సంకల్పం. వైసీపీ మాటలన్నీ ఆచరణలోకి రాని మాటలు అంటూ వైసిపి నేతలపై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. సమస్యను చూసి తాను పారిపోయే వ్యక్తిని కాదన్నారు. ముందడుగు వేయటమే తెలుసు కాని, వెనకడుగు తెలియదన్నారు.
ప్రజలను దోపిడీ చేసే రాజకీయ నేత కంటే తాను ఐడియలిస్ట్ పొలిటీషియన్‌గా ఉంటానని పవన్ కల్యాణ్ స్పష్టం చేసారు. ఢిల్లీ లో గళం వినిపించాల్సిన వైసిపి ఎంపీలు తమ మాట మోడీ వినటం లేదని తప్పించుకుంటున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక న ఆపార్టీ నుండి గెలిచితిన ఒక్క ఎమ్మెల్యేను వైసీపీ లాక్కెళ్లిపోయింది. అయినా నా వెంట ప్రజలున్నారనే కేంద్ర మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్ ఇస్తున్నారు.. అంటూ వైసిపి ప్రభుత్వం పై పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు.