Advertisement
Google Ads BL

సిరిని సేవ్ చేసిన దేవరకొండ బ్రదర్స్


బిగ్ బాస్ దివాళి ఈవెంట్ స్టార్ మా లో ఓ రేంజ్ లో మొదలైంది. నాగార్జున హోస్ట్ గా సుమ కనకాల గెస్ట్ గా బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్స్ ని సుమ బిగ్ బాస్ వైఫ్ లేడీ బాస్ అంటూ గ్లాస్ రూమ్ లో నుండే ఓ ఆట ఆడుకుంది. ఒక్కొక్కరిని లేపి వారితో ఆడేసింది సుమ. తర్వాత నాగార్జున తో ఫన్నీ కామెడీ చేసిన సుమ..వెళ్ళాక బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ మోనాల్ గజ్జర్, దివి అదిరిపోయే డాన్స్ పెరఫార్మెన్స్ తో బిగ్ బాస్ స్టేజ్ పై దుమ్మురేపారు. ఇక నాగార్జున ముందుగా మానస్ ని సేవ్ చెయ్యగా.. తర్వాత షణ్ముఖ్ సేవ్ అయ్యాడు. ఇక దివి, మోనాల్ గజ్జర్ ల డాన్స్ పెరఫామెన్స్ తర్వాత బిగ్ బాస్ స్టేజ్ పైకి దేవరకొండ బ్రదర్స్ వచ్చారు. విజయ్ దేవరకొండ నిర్మాతగా ఆనంద్ దేవరకొండ నటించిన పుష్పక విమానం ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ అండ్ ఆనంద్ లు బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేసారు. లైగర్ విజయ్ దేవరకొండ పంచెకట్టు తో ఇరగదీసాడు. ఇక హౌస్ లోని కంటెస్టెంట్స్ తో గేమ్ కూడా ఆడారు.

Advertisement
CJ Advs

తరవాత నామినేషన్స్ లో ఉన్న సిరి, రవి, శ్రీరామ్, లోబోలలో ఒకరిని సేవ్ చేసే బాధ్యత దేవరకొండ బ్రదర్స్ తీసుకున్నారు. విజయ్ చేతిలో లోబో, రవి సేవ్ అవ్వలేదు.. తర్వాత సిరిని సేవ్ చేసే బాధ్యత ఆనంద్ తీసుకున్నాడు. ఆనంద్ చేతిలో సిరి ఎలిమినేషన్స్ నుండి ఈ వారం సేవ్ అయ్యింది. ఇక శ్రీరామ్ కూడా సేవ్ అవ్వలేదు. తనని సేవ్ చేసిన ఆనంద్ ని ఐ లవ్ యు అంటూ సిరి గట్టిగా అరవడం, షన్ను సిరిని హాగ్ చేసుకోవడం జరిగిపోయాయి. ఇక విజయ్ అండ్ ఆనంద్ లు పుష్పక విమానం ట్రైలర్ స్క్రీన్ మీద చూపించారు.  దేవరకొండ బ్రదర్స్ వెళ్ళగానే చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ డాన్స్ పెరఫార్మెన్స్ తో బిగ్ బాస్ స్టేజ్ పై అదరగొట్టేసింది. 

Bigg Boss 5: Devarakonda Brothers saved Siri:

Anand Deverakonda saved Bigg Boss Siri
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs