Advertisement
Google Ads BL

పవన్ తో అలా మిస్ అయ్యిందంటున్న రాజమౌళి


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే ఎవరికీ ఇంట్రెస్ట్ ఉండదు.. అదే ఇంట్రెస్ట్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి కి ఉందట. మరి రాజమౌళి - పవన్ కళ్యాణ్ కాంబో అని అనౌన్సమెంట్ వచ్చినా చాలు.. బాక్సాఫీసు బద్దలు, ఇండస్ట్రీ అంతా షేకవడం ఖాయం. పవన్ ఫాన్స్ కి అదే కోరిక రాజమౌళి తో పవన్ కళ్యాణ్ మూవీ ఒకటి చేస్తే బావుంటుంది అని. అదే కోరికతో ఒకప్పుడు రాజమౌళి పవన్ కళ్యాణ్ ని కూడా కలిశారట. గతంలో కొన్ని సంవత్సరాల కింద పవన్ కళ్యాణ్‌తో సినిమా చేద్దామని రాజమౌళి.. పవన్ సినిమా షూటింగ్ జరుగుతన్న చోటుకి వెళ్లారట. పవన్ తో మాట్లాడితే చాలా కంఫర్ట్ గా అనిపించింది అని, ఆ తర్వాత పవన్ తో సర్ మీరు చెప్పండి ఎలాంటి సినిమా చెయ్యాలని ఉంది అని.. మీరు ఎలాంటి సినిమా అనుకుంటున్నారో.. చెప్పమంటే.. మీతో నేను ఎలాంటి సినిమా చెయ్యడానికైనా రెడీ అన్నాడట పవన్.

Advertisement
CJ Advs

అయితే రాజమౌళి.. సర్ నాకు కాస్త టైం ఇవ్వండి.. ఏ టైం లో రమ్మంటే ఆ టైం లో వచ్చి కథ చెబుతాను అని రాజమౌళి వెళ్లిపోయారట. ఆ తర్వాత ఓ ఏడాది పవన్ కళ్యాణ్ దగ్గరనుండి కబురు వస్తుంది అని వెయిట్ చేసినా.. రాకపోయేసరికి రాజమౌళి మగధీర, యమదొంగ అంటూ సినిమాలు చేస్తూ పోవడం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడంతో రాజమౌళి కి పవన్ సినిమా అలా మిస్ అయినట్లుగా రీసెంట్ గా రాజమౌళి చెప్పారు. ఆ తర్వాత నేను ఎక్కువ నంబర్ ఆఫ్ డేస్ సినిమాలకు ఇలా నా డైరెక్షన్ వెళ్ళిపోయింది. పవన్ రాజకీయాలతో బిజీ అయ్యారు.. మా ఇద్దరి దారులు అలా వేరయ్యాయి.. పవన్ అంటే చాలా ఇష్టం, అలాగే గౌరవం కూడా అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు. 

Rajamouli says I really love Pawan Kalyan:

Rajamouli says Waited many years to work with Pawan Kalyan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs