Advertisement
Google Ads BL

ముగిసిన పునీత్ అంత్యక్రియలు.. భారీగా హాజరైన ఫాన్స్


కన్నడ టాప్ హీరో పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం ఉదయం అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. వ్యాయామం చేస్తున్న సమయంలో నలత గా ఉంది అంటూ హాస్పిటల్ కి చేరుకునేలోపే పునీత రాజ్ కుమార్ ప్రాణాలు వదిలారు. దానితో ఒక్కసారిగా అభిమానులు కుప్ప కూలరు. కర్ణాటకలో హై ఎలెర్ట్, టాలీవుడ్ స్టార్స్ అంతా దిగ్బ్రాంతికి గురయ్యారు. శుక్రవారం మృతి చెందిన పునీత్ రాజ్ కుమార్ కి శనివారమే అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉండగా.. ఆయన పెద్ద కూతురు ధ్రితి రాజ్ కుమార్.. అమెరికా నుండి వచ్చేసరికి ఆలస్యమవడంతో శనివారం జరగాల్సిన అంత్యక్రియలు ఆదివారానికి పోస్ట్ పోన్ చేసారు.

Advertisement
CJ Advs

అయితే ఈ రోజు ఆదివారం ఉదయమే అంటే చాలా చీకటి ఉండగానే పునీత్ రాజ్ కుమార్ అంతిమ యాత్ర ప్రారంభం అయ్యింది. 04.40 నిమిషాలకు కంఠీరవ స్టేడియం నుంచి కంఠీరవ స్టూడియో వరకు పునీత్ అంతిమయాత్ర జరిగింది. దాదాపు 18 కి.మీ అంతిమయాత్ర సాగింది. అంత ఉదయాన్నే పునీత్ రాజ్ కుమార్ అంతిమయాత్ర జరిగినా.. ఆయన అభిమానులు మాత్రం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కంఠీరవ స్టూడియోలో తల్లిదండ్రుల సమాధుల పక్కనే పునీత్ రాజ్‌కుమార్ కి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పునీత్ అంత్యక్రియలకు చూసేందుకు, ఆయనకి కడసారి వీడ్కోలు పలికేందుకు భార్య అశ్విని, కూతుర్లు, పునీత్ అన్న అందరూ హాజరయ్యారు. ఇంకా సినీ, రాజకీయ ప్రముఖులు, సీఎం బసవ రాజ్ బొమ్మై హాజరై ఆయనకి చివరిసారి నివాళులర్పించారు. పునీత్ అంత్యక్రియలు జరుగుతున్నంతసేపూ ఆయన అన్న శివరాజ్ కుమార్ ఏడుస్తూనే ఉన్నారు. 

Puneeth Rajkumar last rites and funeral Completed:

Puneeth Rajkumar last rites and funeral performed at Kanteerava Studios
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs