Advertisement
Google Ads BL

కంటతడి పెట్టిన చిరు.. ఓదార్చిన వెంకీ


కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణం అందరికి షాక్ కి గురి చేసింది. పునీత్ రాజ్ కుమార్ 46 ఏళ్ళ చిన్న వయసులో హార్ట్ ఎటాక్ తో చనిపోవడం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ ఎంతో మంచి వాడని, టాప్ హీరోగానే కాకుండా, ఎన్నో సేవ కార్యక్రమాల్లో అభిమానుల గుండెల్లో గూడు కట్టుకొవడంతో.. ఆయన మరణంతో అభిమానులు తల్లడిల్లిపోతుంటే. పునీత్ రాజ్ కుమార్ భౌతిక కాయానికి నివాళు అర్పించాడనికి వస్తున్న సినీ, రాజకీయ ప్రముఖులు కన్నీరు పెడుతున్నారు. ఉదయం బాలకృష్ణ ఆప్త మిత్రుణ్ణి కోల్పోయా అంటూ కన్నీరు పెడితే.. మధ్యాన్నం యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్నేహితుడి భౌతిక కాయాన్ని చూసి కంటతడి పెట్టాడు.

Advertisement
CJ Advs

ఇక సాయంత్రం చిరంజీవి, వెంకటేష్ లు పునీత్ రాజ్ కుమార్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళు అర్పించారు. చిన్న వయసులో పునీత్ రాజ్‌కుమార్‌ను అలా నిర్జీవంగా పడి ఉండటాన్ని చూసిన మెగాస్టార్ చిరంజీవి కన్నీరు ఆపుకోలేకపోయారు. పునీత్ అన్న శివ రాజ్ కుమార్ ని పట్టుకుని చిరు కన్నీరు పెట్టి.. చిన్నప్పటి నుంచి పునీత్‌ను చూస్తున్నామని.. పునీత్ ఈ రోజు లేడని తెలిసి మనసు ఒప్పుకోవడం లేదని, దేవుడు పునీత్‌కు చాలా అన్యాయం చేసాడని, పునీత్ మరణం కేవలం కన్నడ సినిమాకే కాదు.. ఇండియన్ సినిమాకు పునీత్ మరణం తీరనిలోటు అంటూ చిరు ఎమోషనల్ అయ్యారు. వెంకీ పునీత్ అన్న శివ ని ఓదార్చారు. బెంగళూరు కంఠీరవ స్టేడియంకు వచ్చిన చిరు, వెంకీలతో పాటుగా శ్రీకాంత్ అలీ లు కూడా పునీత్ భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. 

Puneeth death leaves Chiranjeevi in tears:

Tollywood stars tearful farewell to Puneeth Rajkumar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs