Advertisement
Google Ads BL

షారుఖ్ ఇంటి దగ్గర సంబరాలు


ఈ నెల 3 వ తేదీన ముంబై లోని క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ పార్టీలో ఎన్సీబీ అధికారులకు దొరికిపోయి అరెస్ట్ అయ్యి.. 25 రోజుల పాటు జైలుకే అంకితమయ్యాడు షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్. ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం షారుఖ్ చెయ్యని ప్రయత్నాలు లేవు. ఆర్యన్ ఖాన్ జైలు పాలవడంతో షారుఖ్ అయన భార్య గౌరీ ఖాన్ లు బెంగపడిపోయారు. సల్మాన్ వంటి ఫ్రెండ్స్ షారుఖ్ కి ధైర్యం చెప్పినా.. పుట్టినప్పుడే గోల్డెన్ స్పూన్ తో పుట్టి ఇలా జైలులో కొడుకు నరకయాతన పడుతుండడంతో షారుఖ్ దంపతులు తల్లడిల్లిపోయారు. ఆర్యన్ ఖాన్ ఇంటికి వచ్చేంతవరకు ఇంట్లో ఎలాంటి స్వీట్స్ చెయ్యొద్దని చెప్పిన గౌరీ ఖాన్ ఎక్కువగా పూజ మందిరంలోని గడిపేసింది.

Advertisement
CJ Advs

ఇక మొన్న బొంబై హై కోర్టులో ఆర్యన్ ఖాన్ కి బెయిల్ దొరకడం.. నిన్న ప్రొసీజర్స్ పూర్తి చేసుకున్నా.. ఈరోజు జుహీ చావ్లా పూచి కత్తుపైన ఆర్యన్ ఖాన్ విడుదలయ్యాడు. ఆర్యన్ ఖాన్ విడుదలై ఇంటికి వచ్చేలోపు షారుఖ్ ఇల్లు మన్నత్ వద్ద అభిమానుల కోలాహలం కనిపించింది. కొడుకుని రేంజ్ రోవర్ కారులో ఇంటికి తీసుకుని వచ్చిన షారుఖ్ కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లువెత్తింది. ఇక ఈ రోజు సంబరాలు ఇంట్లో సంబరాలు చోటు చేసుకున్నాయి. కొడుకు ఇంటికి రావడంతో షారుఖ్ అయన వైఫ్ గౌరీ ఖాన్ లు సంతోషపడడమే కాదు.. సంబరాలు చేసుకుంటున్నారు.

Celebration outside Shah Rukh Khan home Mannat as fans:

Aryan Khan reaches his house Mannat
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs