Advertisement
Google Ads BL

ఆల్ టైమ్ రికార్డ్ అంటున్న పుష్ప రాజ్


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17 న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కి రెడీ అవ్వబోతుంది. ప్రస్తుతం పుష్ప పాన్ ఇండియా ప్రమోషన్స్ జోరు ఓ రేంజ్ లో ఉంది. అల్లు అర్జున్ - రష్మిక కాంబోలో పుష్ప సినిమాలోని మూడో పాట సామీ సామీ ఈ మధ్య విడుదలైంది. విడుదలైన మరుక్షణం నుంచి ఈ పాట రికార్డులు తిరగరాస్తోంది. అత్యధిక వ్యూస్ అత్యంత వేగంగా సాధించిన పాటగా సౌత్ ఇండియాలో సరికొత్త చరిత్ర సృష్టించింది సామి సామి సాంగ్.

Advertisement
CJ Advs

విడుదలైన 24 గంటల్లోనే 9 మిలియన్ వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలో కొత్త రికార్డు సృష్టించింది. మరే లిరికల్ వీడియోకు అయినా 24 గంటల్లో వచ్చిన అత్యధిక వ్యూస్ ఇవే. పుష్ప సినిమాలోని మొదటి పాట దాక్కో దాక్కో మేక 24గంటల్లో 8.3 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఇప్పుడు ఆ రికార్డును సామీ సామీ తిరగరాసింది. అత్యధిక వ్యూస్ సాధించిన మొదటి 6 టాలీవుడ్ లిరికల్ వీడియో సాంగ్స్ లో 4 అల్లు అర్జున్ ఖాతాలో ఉన్నాయి.

ఇందులో మొదటి రెండు స్థానాల్లో సామి సామి,  దాక్కో దాక్కో మేక ఉన్నాయి. ఆ తర్వాత రాములో రాముల (7.37 million views), శ్రీవల్లి (7 million views) లిరికల్ వీడియోలు ఉన్నాయి. సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న విడుదల కానుంది.

The whole of South India is grooving to Saami Saami Song:

The whole of South India is grooving to Saami Saami Song from Pushpa
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs