Advertisement
Google Ads BL

ఆర్.ఆర్.ఆర్ గ్లిమ్ప్స్ కి ముహూర్తం ఫిక్స్


రాజమౌళి - ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ మూవీ జనవరి 7 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ మొదలు కాబోతున్నాయి. అందులో భాగంగానే ఆర్.ఆర్.ఆర్ నుండి బిగ్ అప్ డేట్ వచ్చేసింది. దివాళి కి ఇద్దరి హీరోల మీద ఓ టీజర్ రిలీజ్ చేయబోతున్నారనే టాక్ ఉంది. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ కొమరం భీం, అల్లూరి సీతారామరాజుల మీద గ్లిమ్ప్స్ ని కట్ చేసాడని.. అది ఓ 45 సెకన్ల గ్లిమ్ప్స్ ని.. రామ్ చరణ్, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ మీద రాజమౌళి పిచ్చ క్లారిటీ తో ఉండి.. ఈ గ్లిమ్ప్స్ ద్వారా అందరికి క్లారిటీ ఇవ్వబోతున్నారని, 45 సెకన్ల గ్లిమ్బ్స్ ని దివాళీ స్పెషల్ గా కాకుండా ముందుగానే అంటే.. నవంబర్ 1న ఉదయం 11 గంటలకి రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ ప్రకటించారు. 

Advertisement
CJ Advs

45 సెకెన్స్ గ్లిమ్ప్స్ లో విజువల్ వండర్ తో పాటుగా.. ఫాన్స్ కి నచ్చి, మెచ్చే అంశాలను పుష్కలంగా చూపించబోతున్నారని, రామ్ చరణ్, ఎన్టీఆర్ డైలాగ్స్ ఈ టీజర్ హైలెట్స్ అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది.

ఇక అందరూ ఆర్.ఆర్.ఆర్ ఓ విజువల్ వండర్ అని, గ్రాఫిక్స్ సినిమాలో మెయిన్ హైలెట్ అంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ ని రాజమౌళి హాలీవుడ్ రేంజ్ లో ప్రెజెంట్ చేయబోతున్నారని, ప్రమోషన్స్ తోనే సినిమాపై హైప్ క్రియేట్ చేసి.. సినిమాపై అంచనాలు పెంచేయ్యబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. మొదటి వారంలోనే వందల కోట్లు కొల్లగొట్టే ప్లాన్స్ లో రాజమౌళి ఉన్నారని.. ఇక నవంబర్ 1 న వదలబోయే గ్లిమ్బ్స్ సెన్సేషన్ క్రియేట్ చెయ్యడం ఖాయమని.. ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ రిలీజ్ చేసేవరకు గ్లిమ్బ్స్ గురించే మాట్లాడేలా రాజమౌళి.. ఆర్.ఆర్.ఆర్ గ్లిమ్ప్స్ కట్ ఉండబోతుంది అని తెలుస్తుంది.  

Muhurtham Fix For R.R.R. Glimpse:

A 45 second glimpse of RRR Movie will be released on 1st Nov at 11 AM
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs