బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబోలో NBK107 మూవీ డిసెంబర్ నుండి మొదలు కాబోతున్నట్లుగా టాక్ ఉంది. నవంబర్ లో పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టి.. డిసెంబర్ నుండి రెగ్యులర్ షూట్ కి వెళ్లేలా గోపీచంద్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో లేడీ విలన్ గా తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ని తీసుకు వస్తున్న గోపీచంద్ బాలకృష్ణ కోసం హీరోయిన్ ని సెట్ చేసే విషయంలో చాలా తిప్పలు పడుతున్నాడు. బాలకృష్ణ తో నటించేందుకు సీనియర్ హీరోయిన్స్ ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే బాలకృష్ణ తో సినిమా చేసే దర్శకులకి హీరోయిన్ పెద్ద టాస్క్ లా మారింది.
అయితే బాలయ్య - గోపీచంద్ సినిమాలో త్రిష ని హీరోయిన్ గా ఫైనల్ చేసారని అన్నప్పటికీ.. మధ్యలో శృతి హాసన్ పేరు గట్టిగానే వినిపించింది. క్రాక్ తో అదిరిపోయే హిట్ ఇచ్చిన గోపీచంద్ తో సినిమా చేసేందుకు శృతి హాసన్ రెడీగా ఉన్నా.. హీరో బాలయ్య అనేసరికి అమ్మడు వెనకడుగు వేసినట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు శృతి హాసన్ పాన్ ఇండియా హీరోయిన్. ప్రభాస్ తో సలార్ మూవీ చేస్తుంది. ఇక గోపీచంద్ మాత్రం శృతి నే బాలయ్యకి ఎలాగైనా సెట్ చెయ్యాలని.. ఆమెకి మేకర్స్ నుండి 2.5 కోట్ల పారితోషకం తో చర్చలు జరిపాడని, శృతి హాసన్.. 2.5 కోట్లు అన్నా బాలయ్య మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ప్రచారం స్టార్ట్ అయ్యింది. మరి నిజంగానే శృతి హాసన్ 2.5 కోట్ల ఆఫర్ ని కాదనుకుందా?