అనసూయ భరద్వాజ్.. యాంకరింగ్ కి గ్లామర్ ని పరిచయం చేసిన భామ. పెళ్ళై పిల్లలున్నా.. గ్లామర్ షో విషయంలో తగ్గేదే లే అనే అనసూయ భరద్వాజ్.. జబర్దస్త్ కామెడీ షో కి అందాన్ని చూపించింది. కామెడీకి గ్లామర్ తోడైతే.. ఆ షో బంపర్ హిట్ అనేలా చేసింది. జబర్దస్త్ లో అనసూయ అందాలపై ప్రతి గురువారం సోషల్ మీడియాలో చర్చే.. అంత అందంగా, గ్లామర్ గా రెడీ అవుతుంది అనసూయ. ఇక జబర్దస్త్ లో అదరగొట్టేస్తున్న అనసూయ ఇప్పుడు జెమినీ ఛానల్ లో మాస్టర్ చెఫ్ కి షిఫ్ట్ అయ్యింది. మాస్టర్ చెఫ్ హోస్ట్ గా అనసూయ తన అందాల ప్రదర్శన మొదలు పెట్టింది.
చక్కటి వాక్చాతుర్యంతో, అదిరిపోయే డ్రెస్సు లతో, స్వీట్ స్మైల్ తో.. అనసూయ ఒక్క వారానికే మాస్టర్ చెఫ్ పై భారీ హైప్ క్రియేట్ చేసింది. తమన్నా గ్లామర్ కి ఏ మాత్రం తగ్గకుండా అనసూయ అందాల ప్రదర్శన ఉంది. ఇక జబర్దస్త్ లో కేవలం గురువారమే కనిపించే అనసూయ.. మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం లో శుక్ర, శని వారాల్లో కనిపిస్తుంది. సో వారానికి మూడురోజులపాటు అనసూయ బుల్లితెర మీద సందడి చేస్తుంది. ఇక నేడు మాస్టర్ చెఫ్ ఎపిసోడ్ కోసం అనసూయ.. అదిరిపోయే డ్రెస్ తో గ్లామర్ షో చేసింది. మరి అనసూయ అందాలను మీరు ఆస్వాదించండి.