బిగ్ బాస్ సీజన్ 5 లోకి టైటిల్ ఫెవరెట్ గా అడుగుపెట్టిన యూట్యూబ్ స్టార్ట్, షార్ట్ ఫిలిమ్స్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్.. ఏ టైం లోనూ, ఏ వీక్ లోనూ బిగ్ బాస్ లో టైటిల్ ఫెవరెట్ గా అదిరిపోయే పెరఫార్మెన్స్ ఇవ్వలేదు. సిరి, జెస్సిలో తో కాలక్షేపం చెయ్యడం, బెడ్ రూమ్ లో ముచ్చట్లు పెట్టుకోవడం, హౌస్ లోని అబ్బాయిలంతా నామినేట్ చెయ్యగానే నేనేమిటో చూపిస్తా అన్న షణ్ముఖ్.. ఏం చూపిస్తాడా అని ఎదురు చూస్తే.. అది కూడా తుస్ మనిపించాడు. ఇక సిరి తో రొమాన్స్ అంటూ హైలెట్ అవుతున్న షణ్ముఖ్.. తాజాగా ఎనిమిదో వారంలో కెప్టెన్ అయ్యాడు. అది కూడా అస్సలు ఇంట్రెస్ట్ లేని టాస్క్ తో. అక్కడికీ అని మాస్టర్ సన్నీ ని గుంపుగా ఆడుతున్నావ్ అని డైరెక్ట్ గాను, షణ్ముఖ్ ని ఇండైరెక్ట్ గా కడిగేసింది. అని మాస్టర్ ని తోసెయ్యడంతో కెప్టెన్ అయిన షణ్ముఖ్ ని అని మాస్టర్ ఆడేం మగాడు అని తిట్టేసింది.
ఇక కెప్టెన్ అయిన ఆనందం షణ్ముఖ్ ఫేస్ లో కనిపించినా.. మిగతా హౌస్ మేట్స్ ఫేస్ లో ఎలాంటి ఫీలింగ్స్ లేవు. షణ్ముఖ్ కెప్టెన్ అవడం ఇష్టం లేనట్టుగా పెట్టారు ఫేస్ లు. ఇక షణ్ముఖ్ కెప్టెన్ అయ్యాక అందరితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా రియాక్ట్ అయ్యారు . కెప్టెన్సీ సాధించి హ్యాపీ గా ఉండాల్సిన షణ్ముఖ్ లాస్ట్ కి దీనంగా ఫేస్ పెట్టాల్సి వచ్చింది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో సన్నీ.. హీరోలు జీరో అయితే.. జీరో లు హీరోలయ్యారంటూ తనలో తానే షణ్ముఖ్ ని ఉద్దేశించి అనుకుంటున్నాడు. ఇక మానస్, సన్నీ లు ఇకపై మా గేమ్ చూపిస్తామంటూ శపధాలు చేస్తున్నారు.