పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ పోస్టర్స్ తోనే సినిమాపై ఆసక్తి అంచనాలు రేపిన ఆకాశ్ పూరి అండ్ టీం.. సినిమా రిలీజ్ ప్రమోషన్స్ విషయంలోనూ అంతే అంచనాలను ఆసక్తిని క్రియేట్ చేసారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లో ఆకాశ్ పూరి హీరోయిన్ కేతిక ఇంటర్వ్యూ, విజయ్ దేవరకొండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం, అలాగే రొమాంటిక్ ప్రీమియర్ షో ని.. టాప్ డైరెక్టర్స్ ని పిలిచి చూపించడం.. అన్ని సినిమాపై అంచనాలు పెరిగేలా చేసాయి. ఇక ఈ రోజు ఇక్కడ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రొమాంటిక్ గత రాత్రే యుఎస్ ప్రీమియర్స్ తొ సందడి చేసింది.
ఇక ఓవర్సీస్ ప్రేక్షకులు రొమాంటిక్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో రొమాంటిక్ టాక్ అంటూ హడావిడి చేస్తున్నారు. రొమాంటిక్ లో ఆకాష్ పూరి ఇరగ దీసాడని, పూరి కొడుకు అనిపించడంతో పూరి అభిమానుల కోలాహలం ఉంది. ఆకాష్‌ని స్టార్ హీరో రేంజ్‌లో ప్రెజెంట్ చేశారనే టాక్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. రేసీ స్క్రీన్ ప్లేతో సినిమా సాగిపోయిందని, ఎక్కడా బోర్ కొట్టించకుండా సినిమాను రన్ చేశారని కొంతమంది ప్రేక్షకుల టాక్. ఈ సినిమాలో డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి కానీ ఓవరాక్షన్ సీన్స్ అయితే చాలా ఉన్నాయి ఆంటూ మరికొంతమంది తమ ఒపీనియన్ చెబుతున్నారు. ఈ సినిమాలో పూరి మార్క్ స్పష్టంగా కనిపించిందని కొందరు అంటుంటే.. ఇక మరికొందరు మాత్రం సినిమా అంతగా ఆకట్టుకోలేదు అని అంటున్నారు..రొమాంటిక్ సీన్స్ తప్పితే మిగతా సన్నివేశాలను అంతగా ఆకట్టుకునేలా లేవు అంటూ ఓ వర్గం ప్రేక్షకులు రొమాంటిక్ మూవీపై ఇస్తున్న సోషల్ మీడియా టాక్.