నాగ శౌర్య - రీతూ వర్మ జంటగా లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన వరుడు కావలెను మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. భారీ ప్రమోషన్స్ తో సినిమాపై అందరిలో ఆసక్తి రేకెత్తించేలా చేసిన వరుడు కావలెను టీం కి.. ఈ సినిమా సక్సెస్ ఇచ్చేలా కనిపిస్తుంది. భారీ ప్రమోషన్స్ తో బరిలోకి దిగిన వరుడు కావలెను సినిమాకి రీతూ వర్మ కేరెక్టర్ హైలెట్ అవడం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామాగా కనిపించడం, సాంగ్స్ ఆకట్టుకునేలా ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక గత రాత్రి నుండి ఓవర్సీస్ లో ప్రీమియర్స్ హడావిడి మొదలైపోయింది.
వరుడు కావలెను సినిమా ప్రీమియర్స్ ని వీక్షించిన ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది అంటే.. వరుడు కావలెను మూవీకి ఓవరాల్ గా మిక్స్డ్ టాక్ ఇస్తున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు. సినిమా చాలా బావుంది అని కొంతమంది చెబుతుంటే.. కొంతమంది యావరేజ్ అంటున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ జర్క్ లతో ఇంటర్వెల్ ట్విస్ట్‌తో నడిచిపోగా.. సెకెండాఫ్ మాత్రం ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా.. అక్కడక్కడా కొంత డ్రాగ్ చేసినట్లు అనిపిస్తుందని అంటున్నారు. అలాగే నాగశౌర్య, రితూ వర్మ యాక్టింగ్, డీసెంట్ కామెడీ, మ్యూజిక్, నిర్మాణ విలువలు మెయిన్ హైలెట్స్ గా నిలవగా.. సెకండ్ హాఫ్ లో పాటుగా కన్విన్స్ చేయలేని కొన్ని సీన్స్, ఎడిటింగ్ వరుడు కావలెను కి మైన్స్ పాయింట్స్ అంటూ వరుడు కావలెను సినిమాని చూసిన ప్రేక్షకుల టాక్.