Advertisement
Google Ads BL

ఏంటి సుక్కూ.. యాజిటీజ్ గా దించేసావ్


సుకుమార్ - రామ్ చరణ్ కాంబోలో వచ్చిన రంగస్థలం ఓ కళా ఖండం . సుకుమార్ తెరకెక్కించిన ఈసినిమా బ్లాక్ బస్టర్ అవడమే కాదు.. ఆ సినిమాలో నటించిన వారంతా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. రామ్ చరణ్ చిట్టి బాబుగా, రామలక్ష్మి గా సమంత, రంగమ్మత్తగా అనసూయ, ప్రెసిడెంట్ గా జగపతి బాబు.. ఇలా ఏ పాత్రని కొన్నేళ్ళ పాటు ప్రేక్షకులు మరిచిపోలేని విధంగా సినిమాని తెరకెక్కించారు సుకుమార్. రంగస్థలం తర్వాత సుకుమార్ నుండి వస్తున్న పాన్ ఇండియా ఫిలిం పుష్ప సినిమాలో కొన్ని లుక్స్ చూసిన వారికీ రంగస్థలం ఫ్లేవర్ గుర్తుకు వచ్చేలా చేస్తున్నాడు సుక్కు. అల్లు అర్జున్ లుక్ పుష్ప రాజ్ గా అదిరింది అది ఓకె. కానీ హీరోయిన్ రష్మిక ని ఏ యాంగిల్ లో చూసినా రంగస్థలంలో రామలక్ష్మి గెటప్ వేసిన సమంతనే గుర్తుకు వస్తుంది.

Advertisement
CJ Advs

రష్మిక డీ గ్లామర్ గా లంగా ఓణీ, ఆ చీర కట్టు, ఆ గ్లామర్ షో అన్ని సమంతానే గుర్తు చేసేలా ఉన్నాయి. రష్మిక లుక్, ఆమె చేసిన శ్రీవల్లి కేరెక్టర్, ఆ సాంగ్ లో రష్మిక కనిపించిన తీరు అబ్బో.. సమంత రామలక్ష్మి - రష్మిక శ్రీవల్లి లుక్ ని పెట్టి ఫాన్స్ సోషల్ మీడియాలో ఆగమాగం చేస్తున్నారు. సమంత గేదెలని కడుగుతూ ఓణీ ని నడుం కి చుట్టుకుని గ్లామర్ షో చేస్తే.. ఇక్కడ రష్మిక చీర ని నడుముకి చుట్టి గ్లామర్ షో చేసింది. అచ్చం సమంత లా అన్నమాట. ఇక రష్మిక నీటిలో స్నానమాడే సీన్, సమంత ని చిట్టి బాబు స్నానం చేసే టప్పుడు చూసే సీన్ అన్ని యాజిటీజ్ గా ఉండడంతో.. ఇప్పుడు అందరూ ఏ బాబూ సుక్కూ ఏమిటి రంగస్థలం నుండి ఇంకా బయటికి రాలేకపోతున్నావా.. మళ్ళీ అలానే చూపిస్తున్నావు అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు.

Isn't Rashmika also like Samantha:

Rashmika in Pushpa look same like Samantha in Rangasthalam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs