ఆర్.ఆర్.ఆర్ షూటింగ్, ఎవరు మీలో కోటీశ్వరులు షూటింగ్స్ పూర్తి చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ కి ఎప్పుడు పిలుస్తాడా అని వెయిట్ చేస్తున్నాడు. రేపు 29 నుండి ఆర్.ఆర్.ఆర్ అప్ డేట్స్ అదిరిపోతాయ్ అంటూ మేకర్స్ ప్రకటించేసారు. అలాగే ఆర్.ఆర్.ఆర్ ప్రమోషనల్ ఈవెంట్స్ అంటూ ముంబై, చెన్నై, హైదరాబాద్ ఇతర నగరాల్లో ప్లాన్ చేస్తున్నారు. దుబాయ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సన్నద్ధం కావాలి. ఈలోపు రామ్ చరణ్ RC15 సాంగ్ షూట్ కంప్లీట్ చేసుకుంటాడు. ఎన్టీఆర్ కూడా నవంబర్ మొత్తం ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ కి కేటాయించి.. కూల్ గా ఫ్యామిలీతో ఓ విదేశీ ట్రిప్ వేసుకుంటాడని సమాచారం.
ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ తో బిజీ అయితే మళ్ళీ కష్టం కాబట్టి.. ఈలోపు ఎన్టీఆర్ భార్య ప్రణతి, కొడుకులు అభయ్, భార్గవ్ రామ్ లతో కొన్ని రోజులు వెకేషన్స్ కి వెళ్లే ప్లాన్ లో ఉన్నాడని తెలుస్తుంది. భార్య పిల్లలతో కాస్త ఎంజాయ్ చేసి.. తర్వాత ఎన్టీఆర్ నెక్స్ట్ డైరెక్టర్ కొరటాల శివ తో చేసే సినిమా కోసం రెడీ అవుతాడట. కొరటాల కూడా ఆచార్య పోస్ట్ ప్రొడక్షన్ ముగించేసుకుని ఎన్టీఆర్ NTR30 కోసం సన్నద్ధమవుతాడని, ఇప్పటికే ఎన్టీఆర్ తో చెయ్యబోయే సినిమా కోసం హైదరాబాద్ లో స్పెషల్ సెట్ ని కొరటాల సిద్ధం చేయించాడని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ - కొరటాల మూవీ డిసెంబర్ లో పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టడమే.. రెగ్యులర్ షూట్ కి వెళతారని తెలుస్తుంది.
ఈ సినిమాకి సంబంధించిన మేజర్ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాదులో వేసిన భారీ సెట్లో, ఆ తర్వాత షెడ్యూల్ ని ఈజిప్ట్ లో 40 రోజుల పాటు కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా కానీ, అలియా భట్ కానీ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది.