Advertisement
Google Ads BL

పుష్ప: ది రైజ్ సాంగ్‌ లిరిక్స్

పుష్ప పాన్ ఇండియా సినిమా కి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక, రష్మిక మందన శ్రీవల్లి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా సామి సామి అంటూ సాగే మూడో సింగిల్ వచ్చేసింది. దీనికి కూడా అనూహ్య స్పందన వస్తుంది. పక్కా మాస్ అవతారంలో అటు అల్లు అర్జున్.. ఇటు రష్మిక మందన్న కనిపిస్తున్నారు. న్యాచురల్ లుక్స్‌తో కట్టి పడేస్తున్నారు ఈ ఇద్దరూ. తాజాగా పుష్ప నుండి సామి సామి సాంగ్ ని రిలీజ్ చేసారు.

Advertisement
CJ Advs

అమ్మీ ఏందమ్మీ అట్టా సూత్తండావ్.. ఏందమ్మీ..

నువ్వు అమ్మీ అమ్మీ అంటాంటే నీ పెళ్లానైపోయినట్టుందిరా సామీ.. నా సామీ..

నిను సామీ సామీ అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామీ.. నా సామీ..

నీ ఎనకే ఎనకే అడుగేస్తాంటే.. నీ ఎనకే ఎనకే అడుగేస్తాంటే ఎంకన్న గుడి ఎక్కినట్టుందిరా సామీ..

పక్కాపక్కాన గూసుంటేనే పరమేశ్వరున్ని ఎక్కినట్టుందిరా సామీ..

నువ్ ఎల్లే దారే సూత్తుంటే ఏరే ఎండినట్టుందిరా సామీ..

సామీ.. నా సామీ.. నా సామీ.. రారా సామీ.. బంగారు సామీ.. మీసాలా సామీ.. రోషాల సామీ..

సామీ.. నా సామీ.. నా సామీ.. రారా సామీ.. బంగారు సామీ.. మీసాలా సామీ.. రోషాల సామీ..

పిక్కల పైదాక పంచె నువ్ ఎత్తి కడితే..

పిక్కల పైదాక పంచె నువ్ ఎత్తి కడితే.. నా పంచ ప్రాణాలు పోయేను సామీ..

కార కిల్లి నువ్ కసకస నములుతుంటే నా ఒళ్ళు ఎర్రగ పండెను సామీ..

నీ అరుపులు కేకలు వింటా ఉంటే.. ఏఏఏఏ..

నీ అరుపులు కేకలు వింటా ఉంటే.. పులకరింపులు సామీ..

నువ్ కాలు మీద కాలేసుకుంటే పూనకాలే సామీ..

రెండు గుండీలు విప్పి గుండెలు చూపిత్తే పాల కుండలాగా పొంగిపోతా సామీ.. నా సామీ..

సామీ.. నా సామీ.. నా సామీ.. రారా సామీ.. బంగారు సామీ.. మీసాలా సామీ.. రోషాల సామీ..

సామీ.. నా సామీ.. నా సామీ.. రారా సామీ.. బంగారు సామీ.. మీసాలా సామీ.. రోషాల సామీ..

కొత్తసీర కట్టుకుంటే.. ఎట్టవుందో సెప్పకుంటే.. కొన్న విలువ సున్నా అవ్వదా సామీ..

కొప్పులోన పూలు కొడితే.. గప్పున నువ్ పీల్చుకుంటే పూల గుండె రాలిపడదా సామీ..

కొంగే జారేటప్పుడు నువ్వు.. ఆఆఆఆఆ..

నా కొంగే జారేటప్పుడు నువ్వే సూడకుంటే సామీ.. ఆ కొంటెగాలి నన్నే చూసి జాలిపడదా సామీ..

నా అందం చందం నీదవకుంటే సామీ.. నా ఆడపుటకే పీడైపోదా సామీ..

సామీ.. నా సామీ.. నా సామీ.. రారా సామీ.. బంగారు సామీ.. మీసాలా సామీ.. రోషాల సామీ..

సామీ.. నా సామీ.. నా సామీ.. రారా సామీ.. బంగారు సామీ.. మీసాలా సామీ.. రోషాల సామీ..

Saami Saami song from Pushpa released:

Allu Arjun - Rashmika: Saami Saami from Pushpa released
Show comments

LATEST TELUGU NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs