Advertisement
Google Ads BL

ఇంట్రెస్టింగ్: ఏపీ సీఎం జగన్‌తో నాగార్జున భేటీ


గత నెలలో సినీప్రముఖులు ఏపీ సీఎం ని కలవడానికి ప్రయత్నాలు చెయ్యడం, తర్వాత బడా న్మిర్మాతలు మంత్రి పేర్ని నాని తో భేటీ అవడం లాంటి హడావిడి చూసాం. పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రులు, ముఖ్యమంత్రి పై చేసినా వ్యాఖ్యల తర్వాత చిరు లాంటి పెద్దలు ఏపీ ముఖ్యమంత్రిని కలవలేదు. అయితే తాజాగా ముఖ్యమంత్రి జగన్ కలిసేందుకు అక్కినేని నాగార్జున విజయవాడ వెళ్లడం హాట్ టాపిక్ అయ్యింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వచ్చిన నాగ్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లి జగన్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే నాగార్జునతోపాటు ఐదుగురు నిర్మాతలు కూడా సీఎం జగన్ ని కలిసిన వారిలో ఉన్నారు. కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి వివాదం నేపథ్యంలో రిలీజ్ కాలేదు. ఇటువంటి వివాదం పరిశ్రమకు, ప్రభుత్వానికి మంచిదికాదని.. ముఖ్యంగా పరిశ్రమ నష్టపోతుందని భావిస్తూ సీఎంతో చర్చించేందుకు వచ్చినట్లు తెలుస్తుంది. 

Advertisement
CJ Advs

నాగార్జునతో పాటు సినీ నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్ రెడ్డి జగన్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నాగార్జున సినీ పరిశ్రమకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. సినీ రంగానికి వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ఈ సందర్భంగా జగన్ నాగార్జున కి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సీఎం జగన్ తో కలిసి నాగార్జున ఇంకా నిర్మాతలు భోజనం కూడా చేశారు.

Nagarjuna meets AP CM Jagan:

Nagarjuna meets AP CM YS Jagan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs