డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఒకప్పుడు క్రేజీ డైరెక్టర్.. ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు పోటీ పడేవారు. కానీ మధ్యలో పూరికి కష్ట కాలం రావడంతో.. ఆయన చిన్న చిన్న సినిమాలు చేసి మళ్ళీ రామ్ ఇస్మార్ట్ శంకర్ హిట్ తో క్రేజీ డైరెక్టర్ గా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇక పూరి కొడుకు ఆకాష్ పూరి హీరోగా నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తున్నాడు. రేపు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పూరి జగన్నాధ్ చాలా కష్టపడ్డాడు. కొడుకుని రొమాంటిక్ తో నిలబెట్టాలని, నిర్మాతగా పూరి రొమాంటిక్ ప్రమోషన్స్ ని భారీ లెవల్లో చేసాడు.
పాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్, విజయ్ దేవరకొండలని రొమాంటిక్ ప్రమోషనల్ ఈవెంట్స్ కి పిలిచిన పూరి.. సినిమాని శక్తికి మించి ప్రమోట్ చేయించాడు.తాజాగా రొమాంటిక్ ప్రీమియర్ షో అంటూ రిలీజ్ కి ఒక రోజు ముందే మహేష్ AMB మాల్ లో టాప్ డైరెక్టర్స్ తో హడావిడి చేసాడు. రొమాంటిక్ ప్రీమియర్ రెడ్ కార్పెట్ అంటూ నానా హంగామా చేసాడు. రాజమౌళి లాంటి టాప్ డైరెక్టర్ ని తీసుకొచ్చాడు. బిగ్ బాస్ సోహెల్, ఆనంద్ దేవరకొండ, అలీ, ఇంకా వంశి పైడిపల్లి, అనిల్ రావిపూడి, డైరెక్టర్ మోహన్ రాజా, హరీష్ శంకర్, బొమ్మరిల్లు భాస్కర్, బాబీ, మెహర్ రమేష్ లాంటి దర్శకులని పిలిచి కొడుకు రొమాంటిక్ సినిమాని చూపించాడు. అయితే ఇక్కడ గమనించాల్సి ఏమిటి అంటే.. తాను హిట్స్ అందించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ మహేష్ బాబు, అల్లు అర్జున్ ని మాత్రం పూరి ఎందుకో వదిలేసాడు. మిగతా వాళ్ళని మాత్రం బాగానే వాడేసాడు.
అలాగే ప్రభాస్ ఇంటర్వ్యూ, ఆకాష్ పూరి, కేతిక శర్మ, డైరెక్టర్ ఇంటర్వ్యూ తో అందరిలో సినిమాపై ఆసక్తి కలిగేలా చెయ్యడంలో పూరి జగన్నాధ్ పర్ఫెక్ట్ గా సక్సెస్ అయ్యాడు.