Advertisement
Google Ads BL

తమన్నా వల్ల కోట్ల నష్టం


కెరీర్ మొదలు పెట్టినప్పటినుండి ఎలాంటి కాంట్రవర్సీలకు తావివ్వకుండా.. స్టార్ హీరోలతో సినిమాలు చేసి సీనియర్స్ లిస్ట్ లోకి వెళ్లిన తమన్నా ఇప్పటికి.. చేతినిండా సినిమాలో క్రేజీగా కళకళలాడుతుంది. కాకపోతే ఈ మధ్యన తమన్నా హోస్ట్ చేసిన ఓ ప్రోగ్రాం ఆమెని బ్యాడ్ చేసింది. తమన్నా వ్యాఖ్యాతగా మాస్టర్ చెఫ్ అంటూ ఓ వంటల ప్రోగ్రాం ని జెమినీ ఛానల్ లో ప్రసారం అవుతుంది. ఎంతో భారీగా తమన్నా హోస్ట్ గా మొదలైన మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం.. త్వరలోనే మొదటి సీజన్ పూర్తి చేసుకోబోతుంది. ఈ మధ్యలో మాస్టర్ చెఫ్ ప్రోగ్రాంలో తమన్నా ప్లేస్ లోకి అనసూయ వచ్చింది. దానితో తమన్నా మాస్టర్ చెఫ్ ఈవెంట్ నిర్వాకులకి లీగల్ నోటీసులు పంపింది. 

Advertisement
CJ Advs

ఈ ప్రోగ్రాం వలన తాను చాలా ఈవెంట్స్ వదులుకున్నాను అని, మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం కారణంగా తాను నష్టపోయాను అని, తనకి రావాల్సిన బకాయిలు చెల్లించమంటూ తమన్నా నోటీసు లు పంపగా.. మాస్టర్ చెఫ్ నిర్వాహకులు తమన్నా లీగల్ నోటీసు ల విషయమై ఓ ప్రెస్ నోట్ తో వివరణ ఇచ్చారు. తమన్నా తో మాస్టర్ చెఫ్ నిర్వాహకులు 2 కోట్ల రెమ్యునరేషన్ కి అగ్రిమెంట్ చేసుకున్నామని, అది కూడా18  రోజుల కాల్షీట్స్ కోసమని, ఆమె అగ్రిమెంట్ చేసుకోగా.. తమన్నా ఇతర కమిట్మెంట్స్ వలన 16 రోజులు షూటింగ్ కి హాజరై మిగతా రెండు రోజులు ఆమె షూటింగ్ కి రాలేదని.. అందువలన తాము ఐదు కోట్లు నష్టపోయామని మాస్టర్ చెఫ్ నిర్వాహకులు ఆ ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు.

తమన్నా రెండు రోజులు షూట్ కి రాలేకపోవడంతో.. 300 మంది టెక్నీషియన్లు పనిచేస్తున్న తమకి నష్టం వచ్చింది అని, అప్పటికే తమన్నాకి 1.56 కోట్ల పేమెంట్ చేశామని, ఆ రెండు రోజులు కూడా వస్తే మిగతా పేమెంట్ సెటిల్ చేసేవాళ్లమని, కానీ తమన్నా షూటింగ్ కి హాజరు కాకపోవడమే కాకుండా, సెకండ్ సీజన్ అడ్వాన్స్ కూడా ముందే ఇవ్వాలని తమన్నా డిమాండ్ చేసారని, కానీ సెకండ్ సీజన్ కి అసలు తమన్నాని అనుకోలేదని చెప్పిన మాస్టర్ చెఫ్ ఈవెంట్ నిర్వాహకులు తమన్నా న్యూస్ ఏది రాయాలన్నా తమని సంప్రదించాలని చెప్పి తమన్నాకి షాకిచ్చారు. 

MasterChef Telugu Makers issue statement on Tamannaah legal notice:

Tamannaah legal notice on MasterChef Telugu Makers
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs