రాధేశ్యామ్ మొదలు పెట్టినప్పటినుండి ప్రభాస్ ఫాన్స్ రాధేశ్యామ్ అప్ డేట్స్ కోసం రాధేశ్యామ్ మేకర్స్ యూవీ క్రియేషన్స్ వారితో సోషల్ మీడియాలో యుద్ధం చేసేవారు. కానీ నిర్మాతలు ఆచి తూచి అప్ డేట్ ఇచ్చేవారు. తాజాగా రాధేశ్యామ్ రిలీజ్ డేట్ సంక్రాంతి కి ఖాయం చెయ్యడంతో.. మేకర్స్ రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో వేగం పెంచారు. ప్రభాస్ బర్త్ డే కి విక్రమాదిత్య ని పరిచయం చేస్తూ రాధేశ్యామ్ టీజర్ వదలగా.. దానికి విశేషమైన స్పందన వచ్చింది. దానితో ఇప్పుడు ఈ సినిమాలో ప్రేరణగా నటిస్తున్న పూజ హెగ్దే గ్లిమ్బ్స్ వదలడానికి రాధేశ్యామ్ టీం ప్లాన్ చేస్తుంది అని.. అది కూడా దీపావళికి రిలీజ్ చెయ్యొచ్చనే న్యూస్ ప్రచారం లోకి వచ్చింది. రాధేశ్యామ్ ఫస్ట్ టీజర్ లో విక్రమాదిత్యగా ప్రభాస్ ని మాత్రమే పరిచయం చేసిన మేకర్స్.. ఇప్పుడు ప్రేరణ ఒక్కదాన్నే గ్లిమ్బ్స్ లో చూపించబోతున్నారని తెలుస్తుంది.
ఇక దివాళీ నుండి రాధేశ్యామ్ ప్రమోషన్స్ చూసి ఫాన్స్ షాకవ్వాలి అని, పది రోజులకో అప్ డేట్ ఉంటుంది అని, సినిమాలోని ఒక్కో సింగిల్ వదులుతూ సినిమాపై మరింత క్రేజ్ పెంచే ఆలోచనలో టీం ఉందని అంటున్నారు. ఇప్పటికే రాధేశ్యామ్ ప్రభాస్ బర్త్ డే టీజర్ సోషల్ మీడియాలో ఎంతెలా ట్రెండ్ అవుతుందో.. అదే రేంజ్ లో ప్రేరణ రాధేశ్యామ్ గ్లిమ్బ్స్ కూడా ట్రెండ్ అవ్వాలని టీం చూస్తుందట. మరి దివాళీ స్పెషల్ గా రాధేశ్యామ్ నుండి ప్రేరణ టీం రాబోతుంది అంటూ ఇప్పటికే ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో హంగామా స్టార్ట్ చేసారు.