Advertisement
Google Ads BL

చిరు భోళా శంకర్ కి ముహూర్తం ఫిక్స్


చిరంజీవి ప్రస్తుతం కుడి చేతికి ఆపరేషన్ జరగడంతో.. సినిమా షూటింగ్స్ కి కాస్త రెస్ట్ ఇచ్చేసారు. మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ యాక్షన్స్ సన్నివేశాలను పూర్తి చేసి.. రెస్ట్ లో ఉన్న చిరు.. తన తదుపరి ప్రాజెక్ట్  భోళా శంకర్ ని పట్టాలెక్కించడానికి రెడీ అయ్యారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ వేదాళం రీమేక్ గా భోళా శంకర్ తెరకెక్కుతుంది. రక్షా బంధన్ కి చిరు తో పాటుగా ఆయనకి చెల్లెలిగా నటిస్తున్న కీర్తి సురేష్ పోస్టర్ రిలీజ్ చేసిన టీం.. ఇప్పుడు భోళా శంకర్ సినిమా ఓపెనింగ్ కి ముహూర్తం ఫిక్స్ చెయ్యడమే కాదు.. రెగ్యులర్ షూట్ డేట్ కూడా ఇచ్చేసింది.

Advertisement
CJ Advs

అది నవంబర్ 11 అంటే 11.11.21 న ఉదయం 7.45 నిమిషాలకు భోళా శంకర్ మూవీ  పూజ కార్యక్రమాలతో మొదలు కాబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా భోళా శంకర్ రెగ్యులర్ షూట్ కి వెళ్లే డేట్ కూడా లాక్ చేసేసారు. అది నవంబర్ 15 నుండి భోళా శంకర్ సినిమా అఫీషియల్ గా రెగ్యులర్ షూట్ కి వెళ్ళబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలిగా కీలకపాత్రలో కీర్తి సురేష్ ని మాత్రమే పరిచయం చేసారు. హీరోయిన్, విలన్ అలాగే మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మ కొడుకు మహతి స్వర సాగర్ ఇప్పటికే భోళా శంకర్ మ్యూజిక్ స్టార్ట్ చేసేసాడు. 

Megastar Bhola Shankar muhurat date and regular shoot date fix:

Big Update on Chiranjeevi - Meher Ramesh Bhola Shankar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs