రామ్ చరణ్ - శంకర్ కాంబో రీసెంట్ గా మొదలైన RC15 షూటింగ్ ప్రస్తుతం పూణే లో స్పెషల్ గా వేసిన ఓ సెట్ లో జరుగుతుంది. రామ్ చరణ్ - కియారా అద్వానీ లపై శంకర్ ఈ సాంగ్ చిత్రీకరణ చేపట్టారు. గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్ తో చాలా కాష్ట్లీగా ఉండబోతున్న ఈ సాంగ్ చిత్రీకరణకు దాదాపుగా 12 రోజుల సమయం తీసుకుంటున్నారు శంకర్. ఇక ఈ సినిమాలో కీలక పాత్రల కోసం హీరోయిన్ అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర ఇలా చాలామందిని ఎంపిక చేసిన శంకర్ టెక్నీకల్ గాను ఎక్కువగా టాలీవుడ్ నుండే పర్సన్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు. అయితే RC15 లో రామ్ చరణ్ తో తలపడబోయే విలన్ విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగిస్తున్నారు శంకర్. అయితే రామ్ చరణ్ తో తలపడబోయే విలన్స్ విషయంలో రకరకాల పేర్లు ప్రచారం లోకి వచ్చాయి. అందులో ముఖ్యంగా మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ పేరు ఎక్కువగా ప్రచారం జరిగింది.
అయితే శంకర్ హీరో కి ఎంతగా ఇంపోర్టన్స్ ఇస్తారో.. విలన్ విషయంలోనూ అంతే కేర్, ఇంపార్టెన్స్ ఇస్తారు. రజినీకాంత్ రోబో 2 కోసం బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ని తెచ్చినట్టుగా.. రామ్ చరణ్ కోసం బాలీవుడ్ హీరోల్లో ఎవరో ఒకరిని విలన్ చేస్తారని అనుకున్నారు. అయితే తాజాగా మలయాళ సీనియర్ సూపర్ స్టార్ సురేష్ గోపి RC15 లో విలన్ గా నటించబోతున్నారని, రామ్ చరణ్ తో తలపడబోయే పవర్ ఫుల్ విలన్ సురేష్ గోపి అంటూ ప్రచారం జరుగుతుంది. మరి మలయాళంలో ఒకప్పుడు సూపర్ స్టార్ అయిన సురేష్ గోపి ఈమధ్యన ఆచి తూచి సినిమాలు చేస్తున్నారు. ఆయన మలయాళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమే. మరి RC15 విలన్ సురేష్ గోపి అయితే మంచి క్రేజ్ ఉంటుంది అంటున్నారు మెగా ఫాన్స్. చూద్దాం శంకర్ RC15 విలన్ గా ఎవరు నచ్చుతారో అనేది.