మహేష్ బాబు 40 ప్లస్ వయసులో ఉన్నా ఇప్పటికి యంగ్ గానే ఉంటాడు. మహేష్ అందానికి అమ్మాయిలు ఎప్పటికి ఫిదానే. పెళ్లయ్యింది, ఇద్దరు పిల్లలు. మహేష్ అంత ఎదిగినా మహేష్ అందంలో కానీ, ఫిజిక్ లో కానీ ఎలాంటి మార్పు లేదు. రోజు రోజు కి వయసు తగ్గిపోయిందా అన్నట్లుగా ఇంత హ్యాండ్ సం గా తయారవుతున్నాడేమిటి అంటారు.. మహేష్ న్యూ పిక్ చూస్తే. మహేష్ బాబు ప్రస్తుతానికి పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట మూవీలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతుంది. అక్కడ షూటింగ్ జరుగుతుంటే మహేష్ ఫ్యామిలీ ని కూడా వెంట తీసుకుపోయి.. షూటింగ్ లో గ్యాప్ వచ్చినప్పుడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాడు.
అయితే తాజాగా సర్కారు వారి పాట సెట్స్ లో మహేష్ బాబు గొడుగు పట్టుకుని ఉన్న పిక్ ఒకటి సర్కారు వారి పాట మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సోషల్ మీడియాలో షేర్ చేసాడు. నిజంగా ఆ పిక్ లో మహేష్ సూపర్ స్టైలిష్ గాను, చాలా హ్యాండ్ సం గాను, ఇంకా యంగ్ లుక్స్ తో అదరగొట్టేసాడు. అమ్మాయిలు చూసి ఏమున్నాడురా బాబు అనుకునేంత గా మహేష్ బాబు కనిపిస్తున్నాడు. సర్కారు వారి పాట సినిమాలో మహేష్ కాస్త రఫ్ లుక్ లో కనిపిస్తాడన్నారు. కనిపించాడు కూడా. కానీ థమన్ షేర్ చేసిన పిక్ మాత్రం సర్కారు వారి పాట కోసం మహేష్ సిద్దమైన లుక్ అని తెలుస్తుంది. సాంగ్ లో స్టైలిష్ మహేష్ కనిపిస్తాడన్నమాట. ఏదైనా మహేష్ బాబు లేటెస్ట్ క్లిక్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.