Advertisement
Google Ads BL

ఈ రోజు బెయిల్ దొరక్కపోతే మరో 14 రోజులు..


షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కి డ్రగ్స్ కేసులో ఇప్పటికే మూడుసార్లు బెయిల్ రిజెక్ట్ అయ్యింది. ఇప్పటివరకు ముంబై కోర్టులో షారుఖ్ కొడుకు తరుపున సతీష్ మాన్‌షిండే, అమిత్ దేశాయ్ తమ వాదనలు వినిపించారు. కానీ వారి వాదనలకు ముంబై కోర్టు ఆర్యన్ ఖాన్ కి బెయిల్ మంజూరు చెయ్యలేదు. అయితే తాజాగా ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం షారుఖ్ ఫ్యామిలీ ముంబై కోర్టును ఆశ్రయించారు. ఈ రోజు మంగళవారం ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై బాంబే హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ తరుపున ఇండియా నెంబర్ వన్ లాయరైన ముకుల్ రోహత్గీ  తన వాదనలు వినిపించనున్నారు.

Advertisement
CJ Advs

ఈ రోజు బెయిల్ పై జరిగే విచారణ షారుఖ్ కుటుంబానికి కీలకంగా మారింది. ఎందుకంటే ఈ రోజు ఆర్యన్ ఖాన్ కి ఒకవేళ బెయిల్ గనక రాకపోతే.. మరో 14  రోజుల పాటు ఆర్యన్ ఖాన్ జైలు ల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నవంబర్ 1 నుండి బాంబే హైకోర్టుకి దీపావళి సెలవలు కావడంతో.. ఇప్పుడు ఆర్యన్ ఖాన్ కి బెయిల్ రావడం కీలకంగా మారింది. అందుకే షారుఖ్ ఖాన్ ఇండియా నెంబర్ వన్ లాయర్ ని రంగంలోకి దించారు. మరి ఈ రోజు కూడా బాంబే హై కోర్టులో ఆర్యన్ ఖాన్ కి బెయిల్ రాకపోతే మళ్లీ 14 రోజుల పాటు ఆర్యన్ ఖాన్ జైల్లో గడపాల్సిన పరిస్థితి. 

Aryan Khan Bail Hearing In Bombay High Court:

Aryan Khan Must Be Denied Bail as he Can Tamper Evidence
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs